అమ్మా!..నిను తలంచి..

అమ్మా!..నిను తలంచి..

రచయిత: లోడె రాములు

అమ్మ…..!!!
ముగింపులేని మహాకావ్యం..
ఎప్పటికీ కొత్త పుస్తకo..
నేల మీద తొలకరి జల్లులా..
మట్టి పరిమళం..
సూర్యుడిలా,చంద్రుడిలా,తీరంలా..
పాత పడని తేజం…
అమ్మ పంచిన రక్తం ప్రవహించే జ్ఞాపకం….
సర్వ తీర్థంబుల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాద జలము..
( మహా కవి శ్రీనాధుడు)..
భువిని మా అమ్మ కడుపున పుట్టుటోక్కటే నేను చేసిన పుణ్యమ్ము నేటి వరకు…
(మనసు కవి ఆత్రేయ..)
అమ్మను తలచుకుంటే చాలు కళ్లు చెమర్చక మానవు…
చెరగని తీపి గుర్తు అమ్మ..
ఎవరికైనా తొలి స్నేహితురాలు..
తర్వాత గురు స్థానం..తనదే..
ఎదిగాక మానవత్వం వెల్లివిరిసిన తొలి దైవం అమ్మే..
అమ్మే సత్యం..
అమ్మ చలువ లేనిదే ఎదగలేము ..
ఏ స్థాయికి..
అమ్మను ప్రతి నిత్యం పలకరిద్దాం..
మనం పులకించి పోదాం..
అమ్మే కమ్మని భావన..
అమ్మంటే చల్లని తెమ్మర..
అమ్మే అందరికీ అండ..
అమ్మే కోటి వరాల మూట..
అమ్మ ఒడి చదువుల బడి..
అమ్మ బడి ఒక గుడి..
అమ్మే అందరికీ శ్రీ రామ రక్ష..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!