ముద్దుల పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

ముద్దుల పెళ్ళాం

రచన :: సావిత్రి కోవూరు 

ఏమీ చెప్పుదు నేను రమణమ్మక్కా- నా పెంకి పెళ్ళాం కథ వినవే రమణమ్మక్కా – నా ముద్దుల పెళ్ళాం కథ వినవే రమణమ్మక్కా,

పట్టు చీర కట్టుకొని, పక్కపక్కనే తిరుగుతుంది –  పనులేమి తోచకుండ సతాయించి పెడుతుంది ,

సోకు లెన్నో చేసుకొని మురిపాలు కురిపిస్తది –
ఓర చూపులే చూస్తూ వయ్యారాలు ఒలక బోస్తది,
ముట్టుకుంటే కస్సుమంటది రమణమ్మక్కా-  ఊరించి చంపుతుందే రమణమ్మక్కా,

విందు భోజనం పెట్టి స్వీకరించ మంటుంది –
పిండి వంటలు చేసి పళ్లెం నిండ పెడుతుంది,
పట్టక నేను తినకపోతే ప్రాణాలు తీస్తోంది –
మాటలే మానేసి నాతో మౌనంగా ఉంటుంది.

మాటిమాటికి అమ్మ, ఇంటికెళ్తనంటుంది –
వద్దని నేనంటే, అల్లరెంతో చేస్తుంది, అలిగి కూర్చుంటుంది,
పోనీలెమ్మని నేను పోయి రమ్మంటేను, వెళ్ళి –  పొద్దు గూకు వేళకే వచ్చేస్తానంటుంది,

ఒక్క రోజు నన్నిడిచి కుదురుగ ఉండనె ఉండదు పసిపిల్లా కన్నా నాకు రమణమ్మక్కా – పడుచు పెళ్ళామే చిన్న రమణమ్మక్కా,

వారానీకొక్క సారి సినిమాకెళ్దామంటది -మల్లెపూలు
తేకుంటే రమణమ్మక్కా మరి నాకు పస్తంటది రమ్మణమ్మక్కా

అలసిపోయి నేనొస్తే, నెక్లెస్ రోడ్డుకెళ్దమంటది –
సొలసి పోయి నేనొస్తే గోల్కొండకెళ్దమంటది
అల్లరెంతో చేస్తుంది, అలసటంత మరిచే లాగా ఆనందం కలిగిస్తుంది,

నా ప్రాణం నీవంటది నీ ప్రాణం నేనంటది
నా బుజ్జి కన్నంటది – బుజ్జగించి మురిపిస్తుంది,
ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిపాలే కురిపిస్తుంది ౹౹ఏమి ౹౹

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!