నా పెంకి పెళ్లాం…. ముద్దు చేష్టలు

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

 నా పెంకి పెళ్లాం…. ముద్దు చేష్టలు

రచన :: పావని చిలువేరు

దీని తస్సదీయ
కోరానా కాలనా …..దీని
పెంకి చేష్టలు ముదిరిపాయె ,

సంవత్సరం దాటే
నీ చేత్తో నాకూ కాఫీ యిచ్చి అంటీ ,
ఏమి  కాదులే అన్నట్లు
కొంటె చూపులు విసిరే .
ఆ చూపుల తాకిడికి
నదీప్రవాహంలో  చేప పిల్లలా
విలవిల కొట్టుకొని ,
కిందా మీదా పడి ,
కాస్తో కూస్తో మత్తు దించుకొని,
నా చేత్తో నేనే కాఫీ చేసి యిస్తే,

అయ్యో రామ
నన్నే వంట చెయ్యమంటివి…..
ఇంటి నుంచి పనే నాకూ,
ఇంటి పని కాదే అంటి
అంతేలే  నా మీద ప్రేమ తగ్గే అంటివి.
నీ ప్రేమ నిరూపణ కోసం,
గంటే పట్టి చెయ్యి కాల్చుకుంటిని,
ఉఫుఉఫు అని ఊదుకుంటిని,
చెయ్యి పట్టి ముద్దు పెట్టి
నా మీద ప్రేమ ఉంటే
ఏమీ మండదులే అంటివి .

దీని తస్సదీయ
సెంటిమెంట్ మీద ఆయింటుమెంటు  పెడితివి.
చిలిపిగా కన్ను గీటి
సప్పున జారుకుంటివి.
చెయ్యనంటే బుంగ మూతి పెడితివి,
నా ముద్ద బంతి పువ్వువే  నువ్వు,
బుంగ మూతి పెట్టగానే కరిగిపోతిని ,
గంటే చేత పడితిని
పాక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంటిని

జాము రాతిరి వేళాయే
జాగు చెయ్యమాకు రా… అంటివి .
ఫోన్ తీసి పక్కన పెడితివి .
కొంత సమయం ఆగమంటే
వలచినాను వచ్చి వాలిపొమ్మoటివి .
జాగు చేస్తే జాగ లేదు పొమ్మoటివి .
నడుము మడత గాలమేసి ,
చూపులతో  కట్టివేసి ,
గిలగిలా  కొట్టుకొనేలా చేసితివి
మొండి రాక్షసివే నువ్వు….

నీ వన్నె చిన్నెల గారాలు చూసి
మతి తప్పి మురిసిపోయి
మంచమెక్కితిని .

పెంకి పెళ్లామా  నా ముద్దుల పెళ్లామా,
నీకు యెవ్వరు సాటిలేరు ,
నీ ప్రేమకు అంతులేదు.
నిన్ను చేరిన నా జన్మ ధన్యమాయే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!