ముద్దుల పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

ముద్దుల పెళ్ళాం

రచన :: ధనాశి ఉషారాణి

జీవిత సమరములోన
దేవుడిచ్చిన తియ్యని నీడ
ఎన్నడూ విడవని జాడ

మంచి కోరునెప్పుడూనూ
మమతలు పంచును నిత్యము
కోటి వెలుగులు పంచును బతుకున

సంతోషములో తానుగా నిలిచి
దుఃఖములో అందరికన్నా మిన్నగా పతిని తలిచి
ఆకలి చూసి అన్నo పెడుతూ
అమ్మ ప్రేమ కన్నా మిన్నగా ప్రేమను పంచి

బంధాలు కన్నా బలమైనది
జగములో నిలిచిన నిత్య కల్పవల్లిగా
చివరి వరకు వెన్నంటు వుండేటి మమతల వల్లిగా
నిలిచి నిరతము ఇంటిని కాచేను సతి

మమతలు అoదలేదని మారామముచేసి
కోపముతో నిరతము సాదించుతూ
భర్త బాగోగులు కోరేటి గడసరి పెళ్ళాం
భావి జగతిలో మగాడి మంచికోరి మమతల జల్లు భార్య

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!