మాయదారి పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

మాయదారి పెళ్ళాం

రచన :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

వలపులతో వేసింది నాకు కళ్ళెం
వలచి, వరించి మరీ అయ్యింది నాకు పెళ్ళాం

ఆనక గానీ తెలియలేదు నిజం
తనదంతా సీమటపాకాయ్ నైజం

విటమిన్స్, ప్రోటీన్స్ లే తినాలంటది
ఉప్పు,కారం తగ్గించంటది
చప్పిడి కూడు చేతిలో పెడతది

వేళకి తిండి వేళకి నిద్ర అంటూ సమయసారణులే వేస్తా ఉంటది
ఎక్కడికెళ్ళొద్దంటూ హద్దులు పెడతది

చుట్టాలొస్తే చుర చుర చూస్తది
పంక్షన్ లకసలే పోవద్దంటది

వేరు కాపురం పెడదామంటది
వేపుకుని నన్నే తింటా ఉంటది

పిల్లా,జెల్లా కావాలంటది
మల్లెలు తెస్తే దేవుడికెడతది

కాపురమంటేనే కళ్ళురుమి చూస్తది
కళ్ళుపోతాయ్ చెంపలేసుకొమ్మంటది

ఏమిటే ఇది అంటే నాపై ప్రేమంటది
అర్థమే కాక నాకు బుర్ర వేడెక్కిపోతది

ఇదెక్కడి పెళ్ళాం
నా బ్రతుకుకు నేనే వేసుకున్న
మూడు ముళ్ళ గొళ్ళెం
నాకే ఎందుకు దొరికింది
ఈ “”మాయదారి పెళ్ళాం””

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!