మొండిమొగుడు – పెంకిపెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

మొండిమొగుడు – పెంకిపెళ్ళాం 

రచన :: నాగ మయూరి

తనకేమో తెలియదు నే చెబితే వినదు

తలతిక్క పనులన్నీ చేసి తంటాలే తెస్తుంది

వామ్మో వగలాడి వంట చేస్తే వెన్నులోన వణుకే పుడుతుంది

పేరే తెలియని చిత్ర,విచిత్రమైన పదార్థాలు కలిపి పెడుతుంది

ఘుమఘుమ లాడే బిర్యానిలోకి /
కూర బదులు వడియాలు వేయిస్తుంది

చక్కని చుక్కలాంటి చపాతీని/
పాయసంలో ముంచుకు తినమంటుంది

కమ్మగ బంగాళ దుంపల వేపుడు చెయ్యమంటే /
నాకోసం బంగళా ఎప్పుడు కడతావంటూ గొడవకు దిగి, నన్నే వేయించుకు తింటుంది

నా మీద ఈగను వాలనివ్వదు,దోమని కుట్టనివ్వదు/
వాలినా,కుట్టినా,కొట్టినా నాపై తనకే హక్కుంది అంటూ అల్ప ప్రాణులను హడలెత్తిస్తుంది

నేనడిగినది ఏది చెయ్యనంటాది/
నేను వద్దు అన్నదే తను చేస్తానంటుంది….
నా ముద్దుల పెళ్ళాం నాడి పట్టేసిన నేనేమో నాకు కావలిసిందే వద్దు అంటూ నాటకమాడేస్తా

కాఫీ తాగాలనిపించిన సమయాన/
నాకు అసలు కాఫీ వద్దంటూ చెబితే చాలు
వేడి వేడి కాఫీ కప్పు చేతికి అందిస్తుంది

నేనేమో మొండి మొగుడు
తానేమో పెంకి పెళ్ళాం
నందన వనమే మాలోగిలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!