అదృష్టం

అదృష్టం

రచన: కే శివ కృష్ణ

వర్షం వచ్చిన వెంటనే ఎంత దూరంగా ఉన్నా..
ఎక్కడ వజ్రాలు దొరుకుతాయి అంటే అక్కడికి వెళ్లి
వాటిని  వెతికే ప్రయత్నం చేసిన మనుషులు ఎందరో,
ఇదేమీ దౌర్భాగ్యమైన పరిస్థితి అని ప్రశ్నిస్తే?
అదృష్టం వరించే సమయం ఇదేనేమో అని
సమాధానము ఇచెడి వారెందరో…
అదృష్టం అంటే ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా
నీ కాళ్ళ దగ్గరకు చేరీదే కదా.!.
మరి అది కాదా అదృష్టం అని ప్రశ్నించినప్పుడు??
అదృష్టం ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే
ఏది రాదు కదా అని సమాధానం ఇచెడి వారెందరో..
ఇంత తెలిసి కూడా అదృష్టం అంటూ
తిరిగి సమయాన్ని వృధా చేయడం భావ్యమా అని
చింతించిన సందర్భములెన్నో,
అదృష్టం అంటూ తిరిగే సమయాన్ని
కష్టం మీద ఉంచితే కష్టం కూడా ఇష్టంగా మారి
దరిద్రం కూడా అదృష్టంగా మారి
మట్టి కూడా మాణిక్యంగా మారదా.!
అదృష్ట మనే భూతంని వదిలి కష్టపడిన నాడు
తప్పక వరించును సరియైన అదృష్టం.
ఇది తెలియక అదృష్టం అంటూ
చింతించున్న ప్రజలు ఎందరో,
తెలుసుకొని మసులుకో ఓ మానవుడా.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!