మదిని తాకుతూ

మదిని తాకుతూ

అంశం :: నిన్ను దాటి పోగలనా

నీ మాటలతో నా మనసును గారడి చేయించి.!!
నువ్వు లేకుండా నా మనసు నిమిషం కూడా నిలువలేనంటున్నది..!

నీ చూపులతో విసిరే బాణాలు సైతం మదిని తాకుతూ..!
మనసులో నీ మోహపు కుసుమాలు వికసిస్తున్నాయి..!

మయురిలా నీ పరువములో పురివిప్పి నాట్యమాడుతుంటే.!!
కృష్ణా, నీ మురళీతో ఒకసారి నా నడుముపై మీటితే చాలు.!!

నా కంటి మకరందపు బిందువులే నా మనసును
మురిపిస్తుంది.!!
నీ కోసం ప్రతి జామున ఎదురుచూసే రాధలా నిలిచిపోతున్నాను.!!

కాలాలు మారిన, యుగాలు గడిచిపోయినా , సమయం అలిసిపోయినా .!!
నిన్ను దాటి పోగలనా, నువ్వు లేకుండా నా ఊపిరిలోని ఆయువు ఉండగలదా..!

రచయిత :: Sk. Nazeer

You May Also Like

One thought on “మదిని తాకుతూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!