పగబట్టిన మోహిని

పగబట్టిన మోహిని
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

మామిడి తోపు అనే గ్రామం ఈ గ్రామానికి ఆపేరు రాయడానికి ఆ గ్రామంలో ఎటు చూసిన మామిడి తోటలు పచ్చని మామిడి ఆకులు, మామిడి పూతతో కళకళలాడుతూ ఉంటాయి చల్లగా చల్లని గాలులు వీస్తూ ఉంటుంది అందుకే ఆ గ్రామాన్ని ఆ ఊరివారు మామిడితోపు అని పిలుస్తారు. ఆ గ్రామంలో శరభయ్య అతని భార్య కన్నాంబ, నివసిస్తున్నారు. వారి “ఒక కొడుకు పేరు వెంకటపతి ఆ గ్రామంలో శరభయ్య అతని భార్య కన్నాంబ బాగా స్థతిమంతులు. కొడుకు వెంకటపతికి పెళ్ళి కూడా చేసారు. కోడలి పేరు సుకన్య.
కోడలు సుకన్యకు తోలికాన్పు కోసం అని అమ్మగారి ఇంటికి పొయి ఒక ఆడబిడ్డను కూడా కని బారసాల కని వియ్యంకుడు అయిన శరభయ్యకు అల్లుడి వెంకటపతికి కబురు చేయగా శరభయ్య తన కోడలు మంచి కానుకలు పోలం కాగితాలు ఇంకా ఇల్లు వీలునామా తేలేదని మనసులో పెట్టుకొని బారసాలకు పోకుండా తన కొడుకును కూడా పోనీ కుండా అలా ఏదో తోచిన సాకులు చెప్పి బారసాలకు పోలేదు. ఇక చేసేది లేక పోనిలే అని సరిపెట్టుకొన్నాడు వరదయ్య.
మూడు మాసాల తరువాత వరదయ్య కూతురిని మనుమరాలిని తీసుకుని అత్తగారింటిలో వదలి పోవటాని కని తీసుకుని రాగా శరభయ్య అతని భార్య కన్నాంబ వియ్యంకుడు వరదయ్యను చాలా బాగ పలకరించుకొని వరదయ్యకు చాల గౌరవం ఈయగా వరదయ్య చాల సంతోష పడి బావగారు చాలా మంచి మనసు చేసుకొని అతనికి మంచి గౌరవం ఇచ్చాడని పొంగిపోయాడు.
అసలు శరభయ్య, కన్నంబాల బుద్ధులు తెలియక, కాసేపు విశ్రాంతి తీసుకుని వరదయ్య బావగారు “ఈ మధ్య మాకు రావలసిన డబ్బు అందలేదు పరిస్థితుల ప్రభావం వల్ల కుదరలేదు. కొంచెం కాలం పోడిగిస్తే మీకు చెప్పిన ప్రకారం ఇస్తాన్నావి అన్నీ కూడా ఇస్తాను. అని దిగులుగా చెప్పుకొన్నాడు. వెంటనే కన్నాంబ. అంటే ఇప్పుడు కూడా కుదరలేదన్న మాటా! ఒహో ఇది అన్నా మాట సంగతి. అంటూ! యెద్దేవ చేసింది.
చూడండి ఆరోజు తాళి కట్టేటప్పుడు కాపురానికి పంపెటప్పుడు ఇస్తామన్నారు. అన్నారు. తరువాత అలా అలా ఎన్నో ఎన్నెన్నో చెప్పి ఇప్పుడు కనీసం బిడ్డ పుట్టిన అప్పుడన్న మాకు ఇస్తామన్న పొలం కాగితాలు, ఇంటి వీలునామా, ఇస్తామన్న కానుకలు తేకుండా, కూతుర్ని, బిడ్డని, మాకు అప్పగించడానికి వచ్చావా నాయనా చాలు చల్లేవయ్యా.. భలే మంచి పెద్ద మనిషివి అని చాలా దురుసుగా ప్రవర్తించి అన్నం కూడ పెట్ట కుండనే వరదయ్యను బాగా అవమమానించి పంపి వేశారు.. శరభయ్య దంపతులు.
వరదయ్య చేసేదిలేక కూతురి బారం ఆదేవుడికి అప్పగించి తిరిగి తన ఊరికి వెళ్ళి పోయాడు వరదయ్య.
శరభయ్య, కన్నాంబ జంటకు ఒక దురుద్దేశం తట్టింది తన కొడుకుకి మరో పెళ్లి చేస్తే డబ్బు పొలం వస్తాయని, అనుకొన్నదే తడువుగా ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ ద్వారా ఒక మంచి డబ్బు ఉన్న సంబంధం మాట్లాడుకోని ఉన్న కోడలు సుకన్యను ఎలా వదలించుకోవాలో అలోచించి తన కొడకుకు కోడలి పైన మోజు పోయేలాగ చేయాలని ఒక పతకం అలోచించసాగారు.
దానికి తోడు శరభయ్య దాయాది అయిన కరటయ్య ఒకడు సుకన్యకు మామ వరస అవుతాడు. అతడు సుకన్య వచ్చినప్పటి నుంచి అమె పై మోజుపడి ఎలాగైనా సుకన్యను అనుభవించాలని సమయం కోసం వేచ్చి ఉన్నాడు కరటయ్య. వాడు కూడ శరభయ్యతో చేతులు కలిపేడు. “శరభయ్య, కన్నాంబ, కరటయ్య ముగ్గురు కలసి కొడుకు వెంకటపతిని ఏదో పని మీద బయటికి పంపించేసి శరభయ్య అమ్మా సుకన్య మా తమ్ముడు అదే కరటయ్య నీకు మామ వరసే అవుతాడులే ఇంట్లో అందరూ ఊరు పోయారంట కాస్త ఈ రోజుకి ఒక్కసారికి పోయి నీవు వంట అంట చేసిపెట్టిరా ఎంత అయినా నాకు తమ్ముడు నీకు మామ” పోయి తోందరగా ఏదో ఒకటి వండిపెట్టి వచ్చే తల్లి అని అత్త మామ కలసి మాయ మాటలతో కరటయ్య ఇంటికి పంపేరు సుకన్యను.
పాపని నిద్రపుచ్చి సుకన్య కరటయ్య ఇంటికి పోయి వంటచేయడాని వంట ఇంట్లోకి పోయి పనిలో పడింది కొంత సేపటికి కరటయ్య దాహంగా ఉందని వంటగదిలోకి వచ్చి సుకన్యను పట్టుకొని బలవంతం చేయసాగాడు.
ఇంతలో కొడుకు వెంకటపతి రాగానే శరభయ్య కన్నాంబ, నీ భార్య ఆ కరటయ్యతో సంబంధం పెట్టకుని ఉందని కొడుకులో అనుమానం వచ్చేలా చేస్తారు. ఇంతలో సుకన్య కరటయ్య బారినుండి తప్పించుకొని ఇంటికి రాగానే వెంకటపతి అమె ఓళ్ళు చమటతో తడిసి చీరంతా నలిగి బోట్టు చెరిగి ఉండటంతో అనుమానపడి అమ్మనాన చెప్పినట్లు కరటయ్యతో సంబంధం ఉన్నట్లు అనుమానం పడి ఇంటిలో నుండి పొమ్మంటాడు. దానితో శరభయ్య కన్నాంబ కూడా వంతుపాడగా తన భర్త అనుమానించాడని రాత్రి ఎడుస్తూ ఉండగా శరభయ్య కన్నాంబ కల్లబొల్లి మాటలతో ఓదార్చినట్లు అలా దొడ్డి దారి లోనికి తీసుకొచ్చి బావిలోకి తోసి బండరాయి వేసి ప్రాణం పోయేలా చేస్తారు.
తరువాత వెంటనే వచ్చి ఏమీ తెలియని వారిలా నిద్రపోతున్నట్లు వచ్చి గదిలో నిద్రపోతూ ఉంటారు.
ఉదయం పనివాడు బావి దగ్గరకు రాగా ఎవరో బావిలో దూకి చనిపోయారు అని అరవగా అప్పుడు శరభయ్య కన్నాంబ పరుగు పరుగున వచ్చి “అమ్మో అమ్మో ఇంకేముంది సుకన్యలా ఉందే ఎంత ఘోరం జరిగిందే అమ్మో” అంటూ గగ్గోలు పెట్టి చుట్టూపక్కలవారికి సుకన్య తండ్రికి తను కరటయ్యతో చనువుగా ఉండటం తెలిసిపోయిందని భర్తకు మాకు ముఖం చూపలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నదని అందరిని నమ్మిస్తారు.
సుకన్య భర్త తండ్రితో సహ అందరూ నమ్మగా తొందరగా సుకన్యని అందరూ మరిచిపోయారు. సుకన్య తండ్రి పాపని తీసుకోని పోయి సాకుతానని అడగగా వెంకటపతి నేనే సాకుతాను అని ఇవ్వనంటాడు.
తరువాత సుకన్య అత్త మామలు కలసి కొడుకుకి మరో బాగా డబ్బు ఉన్న సంబంధం తీసుకొని వస్తారు. వెంకటాపతి తన అమ్మ నాన్న బ్రోకర్ తో మాట్లాడటం విని చూడు నాన నేను రెండవ పెళ్ళి ససేమిరా చేసుకొను అని తేల్చి చెప్పగా వెంకటాపతి అమ్మ కన్నాంబ నీకు పెళ్లాం వదంటే సరేరా! నీ కూతురిని చూసుకోవడానికి అమ్మ కావాలి కదా! ఆడపిల్లని నీవు ఎలా చూడగలవు అని తెలివిగా మాట్లాడి ఎలాగైతే నేమి రెండవ పెళ్ళికి ఒప్పించి కుమారి అనే పిల్లతో పెళ్లి కూడా జరిపిస్తాడు.
ఆపక్క రోజు కమారికి వెంకటాపతికి శోభన ముహూర్తం ఖరారు చేసి వారి ఇద్దరిని ముస్తాబు చెస్తూ ఉండగా “సుకన్య చనిపోయిన బావిలో నుండి ఒక భయంకరమైన గాలి అది సుడిగాలి అందులో నుంచి ఒక వికృతరూపం పెద్దగా ఈల వేసుకుంటూ వచ్చి బయటకు రాగానే గాలిలో తేలిపోయే అందమైన అపురూపం గల మోహినిగా మారిపోయి అలా గాలిలో తేలుతూ హ.. హాహా… అని వికారంగా అంటూ! పగలబడి నవ్వుతూ ఇంట్లో ప్రవేశించి, ఎవరెవరూ ఎక్కడ ఉన్నారని వెతుకుతూ ఉండగా.. ఈలోగా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని శోభన గదిలోకి నెట్టి తలుపులు మూయగా కొత్త జంట కలవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మోహిని చూసేస్తుంది.
ఇక ఆగ్రహంతో అక్కసుతో వారి ఇద్దరిని మాయతో మంత్రాలతో చెడుగుడు ఆడేస్తాది. శోభన గది అంతా గందరగోళం పుట్టిస్తుంది. ఆరాత్రి అంతా వారి కలవనీకుండా ముప్పతిప్పలు మూడు చెరువుల నీరు తాగిస్తుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాత్రి అంతా విడి విడిగా జాగారం చేసి సొమ్మసిల్లి పోతారు.
ఇంతలో కుమారి అత్త మామలైన శరభయ్య కన్నాంబ వచ్చిన కట్నం డబ్బును లెక్క పెట్టి నగలు అన్నీ ఒకసారి చూసుకుని మురిసిపోయి వాటిని జాగ్రత్తగా ఇనుప బీరువాలో పెట్టి తాళం వేసి తాళం జాగ్రత్తగా కన్నాంబ కొంగుకు ముడేసుకొని బోడ్డులో దోపి పని మనిషి దగ్గర పిండివంటలు తెప్పించుకొని తింటూ సంబరపడుతూ తింటుంటారు. అక్కడ ఊయల్లో బిడ్డ ఎడుస్తున్నా పట్టించుకోకుండా హయిగా తింటూ ఒకరికి ఒకరు తినిపించుకొంటుంటారు.
అదిచూసి మోహికి ఎక్కడ లేని కోపంతో బగ్గున మండి వారు తినే పదార్థాలన్ని పురుగులుగా చిత్ర విచిత్రమైన పురుగులుగా మార్చేసి వారికి తెలియకుండా వారి కనపడకుండా వారిని దుమ్ము రేక్కొడతాది. వారికి ఏమి అర్థం కాక ఎవరు తీసుకున్నారు, ఏమి జరుగుతుందో అర్థం కాకపోగ ఆకలితో నరక యాతన అనుభవిస్తూ, దిక్కు తోచని స్థితిలో ఉంటారు.
వెంటనే పాప ఎడుపు విని గదిలోని ఊయల దగ్గర కుపోయి పాలు పట్టి జోలపాడి నిద్రపోయేదాక ఉండి తిరిగి భర్తకు కనపడుతుంది. అప్పుడు వెంకటపతి సుకన్య ఎమైంది ఎక్కడ కు పొయావు అని ప్రేమగా పలకరించగా మోహిని కరిగి ఎమండి నన్ను మీ అమ్మ నాన్నలే బావిలో తోసి రంకు అంటగట్టి రాయితో కొట్టి చంపేసారు. నన్ను నాబిడ్డకి నీకు దూరం చేసారు.. అంటూ కన్నీరుమున్నీరుగా ఎడుస్తూ, నేను మోహినీగా వచ్చింది. నా బిడ్డను కాపాడి మీ అమ్మ నాన్నల మీద పగ తీర్చుకోవడానికే. ఇప్పుడు నేను సుకన్య, నీ భార్యను కాదు “పగబట్టిన మోహిని”ని.. ఇంతలో శరభయ్య కన్నాంబ రాగా కట్నం కోసం నా జీవితాన్ని కాళరాసిన మీ ఇద్దరిని వదలను. మీకు అనుక్షణం హింసిస్తూ మీకు నాబాధ అర్థం ఐయేలా చేస్తాను. నాబిడ్డను జాగ్రత్తగా చూడకపోతే మీకు తిండి నిద్ర లేకుండా చేస్తాను. అంతే కాదు నాబిడ్డ ఏడుపు వినపడిందో నేను వచ్చెస్తాను. అని గాలిలో కలసిపొయింది.
కొత్త పెళ్ళి కూతురికి మెలుకువ వచ్చి అత్త మామ ఎంది ఎమైంది నన్ను మా నాన్నను మోసం చేసారు. ఇది ఇల్లా దైయ్యాల కొంపా నేను నిముషం కూడ ఉండను ఈ ఇంట్లో ఉండనంటే ఉండను అని భీష్మించి కూర్చొని, అత్త మామల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది దాహం ఆకలి చెవిలో గుప్ గుప్ మంటుంది. ఒకపక్క కోడలి బాధ అర్థం అయినట్లు కానట్టు తికమక పడుతూ కాస్త తేరుకోని శక్తి తెచ్చుకోని అమ్మ కుమారి కొంచెం ఆగు మేము ఉండాముగా! అని రేపు ఈ పాటికి ఆ మోహినని పని ఆటకట్టిస్తాము. అని కోడలికి నచచెప్పి సర్దుబాటు చేసి.. మరుసటి రోజు ఒక ఆరితేరిన భుతాల మాంత్రకుని తీసుకొని వచ్చి దాని పీడ వదిలించమని చెప్పగా. మాంత్రికుడు వచ్చి నిమ్మకాయలు కుంకుమ కర్పూరం ఇంకా రకరకాల గా అలంకరించి మధ్యలో పురిని ఉంచి మోహిని, తాకినీ, భూత, ప్రేత, పిశాచి, అంటూ వికారంగా అర్దం ఐయి కాని మాటలతో మోహినీని పిలవసాగాడు.
మోహిని కాసెపటికే వచ్చేసింది. రావడం రావడంమాంత్రికుడి ఎదురుగా నిలిచింది. మాంత్రికుడు ఒక్క సారి ఉలిక్కిపడ్డాడు. ఇంక ఎవరు నీవు ఎందుకు వచ్చావు. పో.. లేకపోతే నిన్ను బందిస్తా అంటూ రెచ్చిపోసాగాడు మాంత్రికుడు.
మోహిని చూసింది, చూసింది ఒక్క సారిగా మాంత్రకి గిర్….గిర్… అంటూ తిప్పి విసిరి బయట కొట్టింది. అంతే మాంత్రికుడి జాడేలేదు.
తరువాత ఆత్త మామలపైకి దూకింది. నేను చెప్పింది ఏమిటి మీరు చేసింది ఏమిటి అంటూ పరిగెత్తేంచి పరిగెత్తేంచి రాచి రంపాన పెట్టింది. ఇంతలో పాప దగ్గరకు పోయి ఆడిస్తుండగా అక్క అని కుమారి పిలవగా ఆ… అంటూ ఉరిమింది.
మళ్ళి కుమారి కలుగజేసుకొని అక్క వారు చేసిన తప్పుకు నాకు శిక్ష వేయడం న్యాయమా. నాకోసమైన వారిని మన్నించండి అని ప్రేమగా అడిగింది. అప్పుడు కొంచెం శాంతించి నాకు ఎంత ద్రోహం చేసారు. బతికి ఉన్న నన్ను సజీవంగా బావిలో తోసి రాయితో గుద్ది చంపేరే నాబిడ్డను అనాథగా చేసారు. అలాంటి వారిని నేను వదలను అంటూ బాధ పడింది మోహిని రూపంలో ఉన్న సుకన్య.
అప్పుడు అక్క నేను మన పాపను ప్రేమగా గారాబంగా పెంచుకొంటాను. పాప కోసమైన నన్ను నా భర్త ను క్షమించు అని కుమారి బ్రతిమాలగా మోహిని కరిగి అయితే నిజంగా శ్రద్ధగా చూసుకొంటావా అని మాట తీసుకొని చూడు నా బిడ్డకు ఏమైనా హాని కలిగించే పనులు చేస్తే నిన్ను ప్రాణాలతో వదలను. అని హెచ్చరించింది.
వెంటనే అత్త మామ ఐన శరభయ్య కన్నంబలను అనుసరించి వారిని మరలా పీడించి, నానాహింసలు పెట్టి బాధలు పెట్టి తిండి తిప్పలు లేకుండా వారికి నాలుగు రోజులుగా ఏమీ లేకుండా మాడపెట్టగా, అత్త,మామలు ఇద్దరు కలసి అమ్మ సుకన్య ఇలా రోజు చంపే బదులు ఒక్క సారిగా చంపెయ్ తల్లి అంటూ వేడుకొంటారు.
కానీ మోహిని మిమ్మల్ని ఎవరూ క్షమించరు ఒక పని చేయండి అడుకొని తినండి అప్పుడు మీ జోలికి రాను అని వరం ఇస్తుంది అత్త మామలకు అప్పటి నుండి అడుకొంటూ బయట బిక్షం ఎత్తుకొని బతక లేక చావవలేక బతుకుతూ ఉంటారు. శరభయ్య కన్నంబలు, ఇక్కడ వెంకటపతి, కుమారీ, మోహిని దయతో ప్రశాంతంగా కాపురం చేసుకొంటూ పాపను సాకుతుంటారు, అలా పాపకు పదిసంవత్సరాలు వయసు వచ్చేవరకు సుఖంగా జీవిస్తూఉంటారు. రోజు వెంకటపతిని ఒక బోగం స్త్రీ గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు వెంకటాపతి వచ్చే సమయానికి తన పదహారు సంవత్సరాల చాకుడు కూతురిని వల్ల ఇసిరి తమ వైపుకు లాకుంటారు. ఆరోజు నుంచి వెంకటాపతి సాలికొంప్ప మరిగి ఇల్లంతా దోచి వారికి దారపోస్తూ చివరికి భార్యను, కూతురిని పట్టించుకోకుండా చివరికి అప్పుల పాలు అయిపోతాడు. అప్పుడు భార్య కుమారి తన భర్తను నిలధీస్తుంది. పాప పెళ్ళి వయసుకు వచ్చేస్తుంది. ఇక్కడ ఆస్థి కరిగి అప్పులు పెరిగి ఇల్లు అమ్మకానికి పెట్టేందుకు సిద్ధంగాఉందని తట్టుకోలేక , కుమారి అక్క అంటూ మోహినిని తలచుకొంటుంది. అప్పుడు మోహిని చెల్లి ఎమైంది అనగా భర్త చేసిన ఘనకార్యం చెప్పుకొని దుఖించగా!చెల్లి ఇంతేనా చూడు మన ఇంటి బావిలో లంకె బిందెలు ఉన్నాయి అవి దక్కించుకొని ఇకనైనా జాగ్రత్తగా బతకమని మోహిని మాయమై పోతుంది.
ఇక లంకె బిందెలు దొరకడంతో వారికి మరలా పూర్వ బోగాలు తిరిగివచ్చేస్తాయి. కమారికి, వెంకటాపతికి, మరలా పొగరు పుట్టుకు వచ్చేస్తుంది. దాంతో పాపను పట్టించు కోకుండా ఉంటారు.
వెంటనే మోహిని వచ్చి కమారి నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా. నాబిడ్డను జాగ్రత్తగా చూడక పోతే మీకు జీవితం లేకుండా చేస్తా అని బెదిరించగా అక్క పొరబాటు ఇంక ఎప్పుడు అలా జరగదు. అని కుమారి మాట ఇవ్వగా, మోహిని హెచరించి వెళ్ళిపోతుంది. ఇక్కడ శరభయ్య,కన్నంబలు అడుకొంటూ ఉండగా ఒకరోజు పాప అంటే శరభయ్య, కన్నంబ, మనుమరాలు, గుడిదగ్గర కనిపించగా కుమారి పాపతో వీళ్లు మీ తాత, అవ్వ అని పరిచయం చేయగా పాప ఇంటికి రమ్మంటుంది. కానీ వారు మోహిని మమ్ములను రానీదు ఇంకా పీడించి చప్పుతుంది. మేము ఇంటింటికి పోయి ఆడుక్కొనే బతుకుతాము. అని ఎడుస్తూ అంటారు. కానీ పాప బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి పాయసం వడలు వడ్డించి భోజనం పెట్టగా వారు నోటి దగ్గర పెట్టుకొనే లోపే మోహిని వచ్చి తరిమి తరిమి కొట్టి తెరిమేస్తుంది.
పాప కొసం కూడ వారి మోహిని క్షమించదు. కొంత కాలానికి పాపకు పెళ్లి సంబంధం వస్తాది అప్పుడు మోహిని వచ్చి తన కూతురి ఘనంగా పెళ్లి చేయమని ఎన్నో ఎన్నెన్నో నగలు డబ్బు బట్టలు రకరకాల వస్తువులు తీసీమని పెళ్లి ఖర్చులు ఎంతైన పరవాలేదని నా బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పి పోగా కుమారి వెంకటపతి అలాగే చేస్తారు.
పెళ్లి జగుతుంది అందరూ పాపని అత్తగారరింటికి పంపె కార్యక్రమాలు చేసి తీసుకొని బయలుదేరే సమయానికి ఒక సారి నగలు డబ్బు చూసుకొందామని సంచిలో చూడగా ఇంకేముంది డబ్బు నగలు మొత్తం మాయమై ఖాళీగా కనిపించగా పాప అత్తమామలు గగ్గోలు పెట్టస్తారు ఇంతలో డబ్బు నగలు ఎమైనావో ఎవరికి అర్దం కాకపోగ ఈ విషయం ఒక్క మోహినికి మాత్రంమే తలుసు అది డబ్బు నగలు కావు మాయ అందుకే పెళ్ళి ఐపోగానే కనపడకుండా పోయాయి.
ఇంతలో కట్నం డబ్బు కనపడలేదు కనుక మళ్ళీ కట్నం తెమ్మని పాపను వారి తల్లిదండ్రులను అడుగుతారు. పెళ్లి వారు లేకపోతే అమ్మాయిని ఇంటికి రానిమంటూ మొండిగా మాట్లాడుతూ ఇంకా మా అబ్బాయికి మరో కట్నం ఇచ్చే సంబంధం చెసుకొంటామని బెదిరిస్తారు. అప్పుడు మోహిని మళ్ళా వచ్చి ఎంత కాలం ఎన్ని తరాలు ఈ కట్నం కోసం ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతారు. మొన్న నేను ఈరోజు నా కూతురు, ఇలా ఎంత మంది ఆడవారిని కట్నం కోసం చప్పుతారు. ఇకనైనా చెప్పండి, మారండి అంటూ ప్రణయతాడం చేసి, పెళ్ళి వారిని చెల్లచదురు చేసి తికమక పెట్టి కట్నం వద్దు అనే వరకు ఇక ముందు ఎవరూ కట్నం తీసుకోకుండా, ఆడగటానికి భయపడేట్టు
అందరిలో మార్పు తెచ్చి, తన కూతురు కాపురం చక్కగా ఉందని నమ్మకం వచ్చాక, తన కోరిక తీరినందుకు శాంతించి పరలోకని వెళ్ళిపోతుంది సుకన్య అప్పుడు శరభయ్య, కన్నంబలకు, విముక్తి కలుగుతుంది. వారు చేసిన తప్పుకు వరకట్నం వేధింపులు ఇక తరతరాలుగా మానాలంటూ ప్రచారం చేస్తారు. మోహిని పగ చల్లారుతుంది.

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!