అంశం : హాస్య కవిత
మద్యం తల్లి ధరాలాపన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కందర్ప మూర్తి
తల్లీ! నిన్ను తలంచి
బోటిల్ చేత బూనితిన్
మాతృ మమకారంతో
నిన్ను వదల లేక
ఆర్థిక ఇబ్బందు లెన్ని ఎదురైనా
నీ ధర ఆకాశానికి ఎగబాకినా
మండుటెండ జోరున వర్షమైనా
పెద్ద వరుసలో కాళ్లకు కాయలు కాచిన
నోటికి మాస్కు చేతికి సానిటైజర్తో
అవుసరార్థం ఆలి మెడలోని పుస్తెలను
తాకట్టు పెట్టి సత్య హరిశ్చంద్రుడంతటి
ఖ్యాతిని పొందిన నేను
నిన్ను వృద్ధాశ్రమానికేల అప్పగించగలను
ఎన్నెన్ని కష్టాలు ఎదురు పడినా ఓరిమితో నిన్ను దర్సించిన
నా మనసు కెంత ఆనందమో
ఏమని ఎలా వర్ణించను
నన్ను చిరంజీవిగా ఆశీర్వదించు తల్లీ!