జన్మనివ్వడం అమ్మకు ఒక పునర్జన్మ

జన్మనివ్వడం అమ్మకు ఒక పునర్జన్మ

రచన: నాగ రమేష్ మట్టపర్తి

నీవు పుట్టక మునుపే
తన కడుపు పంచిందిరా… సిన్నోడా…!

నీకు జన్మనిచ్చేందుకు
పురుటి నొప్పులనోర్చి పేగు తెంచిందిరా… బిడ్డా…!

నీవు పుట్టిన వెంటనే
తన ఒడిని ఊయల చేసిందిరా… కన్నా…!

నీ ఆకలి తీర్చేందుకు
తన రక్తాన్ని పాలుగా మార్చిందిరా… కొడుకా…!

నీ వెచ్చని సుఖనిద్రకై
తన చీరను పరుపుగా పరిచిందిరా… పిల్లోడా…!

నీ మలమూత్రాలను కడిగి సేవలందిస్తూ
తన సుఖాన్ని మరిచిందిరా… బుడ్డోడా…!

నీ ఉన్నత ఆశయ సాధనకై
తన ఆశలు ఆవిరి చేసేసిందిరా… నాయనా…!

నీకై తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆమె రుణాన్ని…..!!!
ఏమిచ్చి తీర్చుకోగలవురా… ముద్దులకన్నా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!