మూర్ఖుడు
రచన: జీ వీ నాయుడు
కూసుంటే లేవలేడు
కుర్ర పిల్ల కావాలంటడు
ఏంమొగుడో శాడిస్టుడు
ఉన్నదాన్నే చూడలేడు
ఉరకలేడు పలకలేడు
భూమ్మీదా ఇసుంటోడు
సూద్దామన్నా కనబడడు
ఇల్లు ఇడిసి యాడికీ పోనీడు
కూరగోయలు తేలేడు
నేను పోతానంటే వద్దంటడు
పొద్దున్నే వస్తడు పాలోడు
బెల్లు కొట్టి పిలుస్తడు చిన్నోడు
వాడిపైకి ఊరుకుతుడు మా ముసలోడు
పాలోడే అంటే బెల్లుకొట్టిండంటడు
శాపనారదాలు పెడతడు
అనుమానాలు పుట్టెడు
ఇక మారడు ఈ మూర్ఖుడు.