అంశం: హాస్య కవితలు
వెరైటీ టిఫినీలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:రాధ ఓడూరి
నానమ్మ నుదుటిపై అమృతాంజన్
తాతయ్య చేతిలో జండూబామ్
ఎందుకంటే…!?
టిఫినీలదేముంది
అన్నీ పొట్టలోకేగా
మార్పుచేస్తే పోలా
వెరైటీగా
చేసాను…!
సమోసా షేక్
పిల్లలు ఆత్రంగా తాగారు
ఇడ్లీల చాకో బార్
పెద్దలూ లాగించారు
ఇంతలో….!
పొట్టలో గుడగుడ బుజ్జికీ చిన్నీకి
కడుపులో నొప్పి అత్తామామలకి
అప్పుడే వచ్చారు నానమ్మ తాతయ్య
చూసి తల కొట్టుకున్నారు ఏడ్వలేక
అప్పుడే జరిగింది…!
వారి తలలో సునామీ
అందుకే ఇచ్చాను
పెయిన్ రిలీఫ్ బామ్స్
బాగా వర్ణించారు. బాగుంది