ఏడ తానున్నాడో

(అంశం: “ఏడ తానున్నాడో”)

ఏడ తానున్నాడో

రచన:రాధ ఓడూరి

హత్యాచారాలు పెరిగిపోతున్నాయి
పిల్లలు,యువతులు, ముసలివారు
హత్యాకాండ కొనసాగుతోంది
బాధితుల తరపు వారి మనోవేదన
హృదయవికారంగా ఉంది
తరుణీమణులను చిదిమేసే అధికారం ఎవ్వరిది
మృగాడి పశు ఆలోచనలను
చిదిమేసే వాడు ఎక్కడున్నాడు
‘ఏడతానున్నాడో’ తెలీనప్పుడు
తరణీ నడుం బిగించు
నీ చేతులే మారణాయుధాలు
నీ చేతివేళ్లే చురకత్తులు
అదను చూసి పంజా విసురు
తోడేలు లాంటి మృగాడిని వదలకు
ఆడపులిలా గర్జించు
తరుణీమణులకు ఆదర్శమవు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!