నీ..నా..భావనలు

నీ..నా..భావనలు

అంశం :: నిన్ను దాటి పోగలనా

ప్రతి విషయం అద్భుతం నీలో
ఎంత వేచి చూశానో నీకై
నిక్షిప్తమైన సౌందర్యాన్ని
నాకే సొంతం చేసిన ఆనందమో
అంతు లేదనుకున్న రహస్యాన్ని
చేధించిన సంతోషమో
తెలియని మైకంలో నన్ను నేను
గురుతు తెచ్చుకుంటున్నా
ఎన్నటికైనా
నిన్ను దాటి పోగలనా సఖి..

ఇంతకాలం దాచిన రహస్యాన్ని
నీముందు పరచిన సమయం
ఏ మైకం కమ్మెనో తెలియని వేళ
నిజమా కలయా తెలియని మాయలో
కొట్టు మిట్టాడుతున్న తీరు
ఈ మాయ ఏంటో అవగతం కాని
అయోమయం..
ఏ తీరుగా మారునో తెలియని ప్రయాణం
సడి లేని మార్పు ఏల వచ్చెనో తెలియకుంది నాలో
నిన్ను దాటి పోగలనా సఖ

రచయిత :: విజయమలవతు

You May Also Like

3 thoughts on “నీ..నా..భావనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!