వంటలన్న

వంటలన్న

అంశం:: నిన్ను దాటి పొగలనా

పెళ్ళైన నాటినుండీ
ఈ నాటి వరకు
పెంట చేసావే గానీ
వంట రాలేదు నీకు!

అందాన్ని చూసి ప్రేమించి
అరగుండువాడినయ్యాను
నువ్వు మాత్రం నా వంట తిని
మందంగా మారావు!

ఆవకాయ నుండి
ధమ్ బిర్యానీ వరకు
నీకోసం అన్ని వంటలూ
అవపోసన చేసినా

అన్నమొండడం కూడా
నేర్పించలేకపోయాను
చివరికి నేనె
వంటలన్నను అయ్యాను.

ఎన్ని కష్టాలొచ్చినా
ప్రేమించిన పుణ్యానికి
దాటిపోగలనా నిన్ను
జీవిత కాలానికి….

రచయిత :: శాంతి కృష్ణ

You May Also Like

4 thoughts on “వంటలన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!