కాలమే మార్చింది

కాలమే మార్చింది

రచన: సుజాత.కోకిల

ఒక్క క్షణం నిన్ను చూడగానే నా మనసు ఆనందంతో, పరవశించిపోయింది.
ఒక్కసారిగా, నా వయసు ముప్పై ఏండ్ల
వెనుకకు నడిచింది. నీతో గడిపిన
ఆ జ్ఞాపకాలు మళ్లీ నీతో గడపాలని ఉంది.
అందుకు నా శరీరం సహకరించండo లేదు!
శిథిలమైన ఆ ఇంటిలో తిరిగిన ఆ జ్ఞాపకాలు
ఇంకా తాతయ్య చెప్పే కబుర్లు వింటూ,
అమ్మమ్మ చేసిన జంతికలు తింటూ,
మన ఇంటి నుండి బడికి నడిచిన ఆ జ్ఞాపకాలు
నిరంతరం గుర్తుకు వస్తూనే ఉన్నాయి.
సమరయోధులు ఆశయాల కై
ఉద్యమాల ఊపిరిలో వెలుతురు లేని చీకటిలో
ఎదురీతకు నిలబడి అహర్నిశలు కృషి చేశాం
అప్పటి ఆత్మీయ అనుబంధాల్ని పంచుకున్న
మనం మర్చిపోగలమా నిత్యం ఆ జ్ఞాపకాలు కాపలా కాస్తున్నాయి. అలసిపోయిన
మన శరీరాలు అస్తమించే సూర్యుడు కోసం ఎదురు చూస్తున్నాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!