రాకాసి లోయ

రాకాసి లోయ

రచన: మంగు కృష్ణకుమారి

పొగమంచుకి పొటీగా అలముకున్న ‘కొయిలా’ పొయ్యి పొగ తరంగాలు
‘పేరుకు తగ్గ‌ పొయ్యి ! దీనితో సమంగా పరుగులు నా వల్ల కాటంలే’ రాక్షసి
బొగ్గు చిటపటల్లా మా పిన్ని రుసరుసలు. గంటలో వంట పూర్తి!
అయినా రాజుకుంటున్న పొయ్యి మీద ఏ వేడి నీళ్ళో కాచుకోవచ్చునట కూడా!

ప్రయాణంలో సరదాగా రైలెక్కి కిటికీ సీటు పక్కే కూచొడమే కాకుండా,

‘తొంగి తొంగి’ చూస్తుంటే “బుర్ర లోపలకు రానీవే బుర్ర లేని దానా,

కళ్లలో పడితే అసలే అది రాక్షసిబొగ్గు ” అంటూ ప్రేమగా మందలించే అమ్మతొ అన్నా!

“అమ్మా! పిన్ని గానీ ఈ బొగ్గుని రైలెక్కించేసిందా?”

ఆనాడు రాక్షసి బొగ్గంటే అంతే తెలుసు!

అన్నలారా! ఎన్నెన్ని బాధలకోర్చి మీరీ
నేల బొగ్గును తవ్వుతున్నారో!

మీ బాధ చెప్పుకోలేక ఎంత సతమతం అవుతున్నారో?

ముక్కులోకీ గొంతులోకీ బొగ్గు తునకలు ‘దూరి దూరి’ ఏ వ్యాధులతో అతలాకుతలం అవుతున్నారో!

చిన్న జూట్ ముక్కకి ఈ బొగ్గు పొయ్యి అంటుకుంటుందే!

పదేను గుప్పెళ్ల బొగ్గుతో పదారు పెట్టెల రైళ్లూ,

ఇరవై వేగనల్ ల గూడ్సులూ చోదకులు చకాచకా నడిపేస్తారే!

మరి నిరంతరం బొగ్గు బుట్టలు మోస్తున్న మీ కష్టాలెందుకు కదలవన్నా?

మిమ్మలని నిచ్చెనలాగే వాడుకుంటున్నారా?
మీరు లేకుంటే గుప్పెడు బొగ్గు కూడ రాదన్న నిజం విస్మరించిందా ఈ జగం!

ఏనాడో కోహినూరు నీ తట్టలో దాగొనే ఉండి ఉంటుంది!

రాజుల కిరీటాల్లో దేవుని హారాల్లో , ఆడవాళ్ల ఆభరణాల్లో మెరుపులు నీ నలుపుల్లొంచే వచ్చేయేమో!

బొగ్గు తవ్వి తవ్వీ నీ తలకు తెచ్చుకోకు!

నువ్వే రగులుకొనే రాక్షసి బొగ్గువయిపో బొగ్గు తవ్విన చేతితొ ఓ అరణి పట్టుకో!

నీ చేతిలో బొగ్గును వజ్రాల్లా మలచుకుంటూ

నిన్ను మసి బొగ్గులా తీసి పారేసిన యజమానులందరూ

వణుక్కుంటూ నువ్వే అసలైన రవ్వవనీ గ్రహిస్తారేమో!

సింగరేణి బంగారాల్లారా! పాతాళం నించీ అకాశానికే‌ మీ‌జెండా ఎగరాలి!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!