రిపబ్లిక్ డే

అంశం : స్వేచ్ఛా స్వాతంత్య్రం ఎక్కడ??

రిపబ్లిక్ డే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

ఎంతోమంది త్యాగమూర్తులు
పోరాటాలు చేసి రక్తం చిందించిన నేల
రైతన్నలు శ్రమటోడ్చి పండించిన నేల
డెబ్భై ముూడు సంవత్సరాలలో వచ్చిన
స్వాతంత్య్రం నిరంకుశ పాలనలో ఉందా
చిన్నా పెద్దా ముసలీ ముతకలను
కూడా వదలని మనుషుల రూపంలో
ఉన్న క్రూర మృగాలలో ఉంది ఈ స్వేచ్ఛ
వీళ్లకెక్కడి నుండి వచ్చింది
వీళ్లకి ఇదేమైనా న్యాయంగా ఉందా?
పాలకులు ఏం చేస్తున్నారు
స్త్రీలు పురుషులు సమానం అంటూ
వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇస్తారే తప్ప
స్త్రీకి స్వాతంత్య్రం ఎక్కడుంది.
స్త్రీ ఉద్యోగం చేసి రాత్రి పన్నెండు గంటలకు వచ్చేరోజులా ఇవి మన త్యాగమూర్తులు
అందించిన స్వాతంత్య్రం ఎక్కడుంది
నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా?
శాంతియుతంగా ముందుకు కదిలి
నిజమైన స్వాతంత్ర్యాన్ని తెచ్చుకుందాం
మన జాతి గౌరవాన్ని కాపాడుకుందాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!