మనసు దొంతరలు

మనసు దొంతరలు

రచన: సుజాత. కోకిల

సూర్యుని కిరణాల తాకిడికి,
ఉలిక్కి పాటుగా  నిద్ర లేచాను.
ఆరుబయట మల్లెతీగ పందిరి కింద!
కొత్తగా ఉంది తెలియని అనుభూతి
ఆనందంతో పరవశించిపోయాను.
దుప్పటి తొలగించి మెల్లిగా లేచాను.
చాలా పొద్దుపోయింది కొత్త ఇల్లు,
కొత్త వాతావరణం పుట్టింటి నుండి,
వచ్చిన ఏ ఆడపిల్లకైనా ఇలాగే ,
ఉంటుందేమో ఈ బిడియం భయం
పక్కలో సాకేత్ లేడు  ఉదయాన్నే
లేచినట్టు ఉన్నాడు. నాకు మెలుకువ రాలేదు.
లేపితే బాగుండేదేమో, చాలా పొద్దుపోయింది.
నేను ఇప్పుడు అందరి ఎదురుగా వెళితే బావుండదేమో చాలా సిగ్గుగా ఉంది.
సాకేత్ కోసం నా కళ్ళు వెతుకాయి.
అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఇటు వైపే
బామ్మ ఎదురుగా వస్తు ఏంటమ్మాయ్,
బాగా నిద్రపట్టిందా ? కొత్త వాతావరణం కథ!
అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.
సిగ్గుతో నా కళ్లు నేలకు వాలాయి.
నా బుగ్గలు ఎరుపెక్కాయి సాకేత్
నా వెనుక వైపుగా వచ్చి నా కళ్ళు
గట్టిగా మూశాడు హు వదలండి అన్నాను.
సిగ్గుతో అతని గుండెలపై వాలిపోయాను తన్మయత్వంతో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!