ప్రేమకు ప్రతిరూపం “పిల్లలు”

ప్రేమకు ప్రతిరూపం “పిల్లలు”

రచన: నాగ రమేష్ మట్టపర్తి

పాలు కారే మీ లేేలేత  “బుగ్గలు ”
పరిమళం నిండిన పారిజాత “మొగ్గలు ”

కల్మషమెరుగని మీ బోసి “నవ్వులు”
ఎప్పటికీ వాడిపోని తాజా”పువ్వులు”

కోటి పుణ్యాల ఫలం మీ ఈ “జన్మ”
చేసింది ఒక స్త్రీమూర్తిని  “అమ్మ ”

నాన్న ఎదపై ఎక్కి మీరు ఆడే “ఆటలు ”
జన్మ జన్మలకి తరగని నిధుల “మూటలు ”

నట్టింట మీ కేరింతల “అరుపులు ”
తీసాయి ఈ ఇంట సంతోషాల  “తలుపులు ”

అమ్మ, నాన్న, అత్త, తాత అనే మీ మాటల “జల్లులు”
విరబూయిస్తాయి మా అందరి మదిలో “హరివిల్లులు”

మంచితనం, మానవత్వంతో మీరు పొందాలి “యశస్సు”
ఈ అమ్మానాన్నల దీవెనలతో నిశ్చితం మీకు 100 ఏళ్ళ “ఆయుష్షు”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!