శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం ఆంధ్రా – ఒడిసా రాష్ట్రసరిహద్దు ప్రాంతం. పాతపట్నానికి మూడు కిలోమీటర్లదూరంలో పర్లాకిమిడి పట్నం ఉంది. ఈ రెండిటిని కలుపుతూ మహేంద్రతనయా వంతెన ఉంది. సరిహద్దు ప్రాంతమగుట వలన ఇక్కడ ఉభయభాష, సంస్క్రతులు కనపడతాయి. పాతపట్నంలో గల శ్రీనీలకంఠేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. అది పర్లాకిమిడి రాజుల కాలం నుండి ఉండేదని పేర్కొంటారు.
ఈ ఆలయంలో శివుడు ఆరాధ్యదేవుడు. సంవత్సర కాలమంతా నీటిలోనే శివలింగముంటుంది. ఆ నీరు ఎక్కడ నుండి వస్తుందనేది ఇప్పటికి అంతు చిక్కని రహస్యమే. దగ్గరలో చెరువు ఉండడం వల్లనా, లేక మహేంద్రతనయా నది ప్రవహించుట వలన అన్నది ఇప్పటికి ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. కేవలం వర్షాకాలంలోనే కాదు అన్ని కాలాలలోను నీటిలో శివలింగముండడం విచిత్రమే కదా. ఈ దేవాలయం లోపలి ప్రాంగణములో చుట్టూ శివిలింగాలు ఉన్నాయి. అవి మాత్రం మామూలుగానే కనపడతాయి. కేవలం ముఖ్యాలయంలోనే నీరు ఉండడం ఆ నీటిలో శివలింగముండడం ఊహకందనిది. ఈ దేవాలయంలో నిత్యపూజలు జరుగుతాయి. కార్తీకమాసమంతా జనసందోహంతోను, మహశివరాత్రినాడు జాతర జరగడం గొప్ప విశేషం. ఆంధ్రా-ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులలో ఉండడం చేత చుట్టప్రక్కల నుండి జనాలు తరలి వస్తుంటారు. ఆలయవిశేషాలను తెలుసుకొని దూరప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి పూజభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. అక్కడక్కడా చక్కని శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఉత్కళాంధ్ర కళానైపుణ్యం కొట్ట వచ్చినట్టు కనపడుతుంది. ఆసక్తిగలవారందరూ ఈ ఆలయాన్ని దర్శించకుండా వుండరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!