అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు
యాగంటి నంది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
సృష్టిలో ఎన్నో వింతలు, విడ్డూరాలు. మరెన్నో అద్భుతాలు రహస్యాలు. అంతుచిక్కని రహస్య స్థావరాలు ఎన్నో.. అందులో ముఖ్యంగా చెప్పుకునేది, ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. ఇది కర్నూలు జిల్లాలో కలదు. ఈ ఆలయ ప్రవేశం ద్వారం అత్యద్భుతంగా ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకరమైన ఎత్తైయిన నల్లమల కొండలు. పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా ఉమామహేశ్వరులుగా ప్రక్కప్రక్కనే విగ్రహాలుగా దర్శనం ఇవ్వడం ప్రత్యేకం.
మొదట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించాలని, విగ్రహాన్ని తయారు చేసే క్రమంలో విగ్రహ కాలి బొటనవేలు విరగడంతో ఆ కార్యం విరమించుకుని, శివపార్వతులను ఉమామహేశ్వరులుగా ప్రతిష్టించారు. ప్రక్కనే ఉన్న గుహలో ఈ వెంకటేశ్వరస్వామిని ఉంచడం ఒక ప్రత్యేకం. అక్కడే వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పారు అని ఒక నానుడి.
గుహలోని ఆలయ ముఖ ద్వారం ప్రవేశం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాతి విగ్రహంగా ప్రతిష్టించబడిన నంది ప్రత్యేకం. ఈ నందినే బసవన్న అని కూడా అంటారు. మొదట నాలుగు స్తంభాల మధ్య ప్రదక్షిణకు వీలుగా ఈ నంది ఉండేది. నాలుగు స్తంభాల మధ్య ప్రదక్షిణలు వీలుగా ఉండేది. సంవత్సరానికి అంగుళం చొప్పున ఈ నంది పెరుగుట వలన నాలుగు స్తంభాలను ఆనుకున్నట్టుగా ఉంటుంది. ఈనంది ఏవిధంగా పెరుగుతుంది?. ఎందుకు పెరుగుతుంది? అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే.. పెరుగుటకు గల కారణమేమిటో శాస్త్రజ్ఞుల సైతం అంతుపట్టలేదు. కొన్ని రాళ్ళు పెద్దవవుతాయి, అందువల్లే పెరుగుతోంది అని చెప్పడం తప్ప అసలు కారణాన్ని వెలికితీయ లేకపోయారు. ఇప్పటికీ ఆ నంది ఎందుకలా పెరుగుతుందో అంతుచిక్కని రహస్యo. ఈ నంది రంకె వేయడం ఒక ప్రత్యేకం. వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో కూడా ఈ విషయాన్ని వివరించారు. జనులు కూడా విన్నట్టుగా చెబుతూ ఉంటారు.. కానీ ఎందుకిలా అవుతుంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే.
ఇక్కడ శనీశ్వరుడు, నవగ్రహాల గుడి ఉండకపోవడం విశేషం. అగస్య మహాముని శాపం కారణంగా కాకి అక్కడ నివసించదు. కాకి శనీశ్వరుడి వాహనం కావడం వల్ల ఈ పుణ్యక్షేత్రంలో శనీశ్వరుడు నవగ్రహ గుడిలు ఉండవు.
ఇది కర్నూలు జిల్లాలోని యాగంటి ఆలయ విశేషాలు రహస్య ప్రదేశాలు.
యాగంటి ఆలయం విశేషాలకు సంబంధించిన ఈ వ్యాసం స్నేహితురాలి సహాయంతో వివరించినది. అనుకరణ కాదు.
రచనా శైలి బాగుంది. బాగా వ్రా సా వు.
అంతుచిక్కని రహస్యం తెలిపారు
రహస్యంగానే
యాగంటి దర్శనం బాగుంది…