కోరిన కోరికలు తీర్చె కల్పవల్లి కనకమహాలక్ష్మి

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

కోరిన కోరికలు తీర్చె కల్పవల్లి కనకమహాలక్ష్మి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

విశ్వంలో మానవుడు శాస్త్ర రీత్యా ఎంత ప్రగతి సాధించిన మనల్ని నడిపించే అద్భుతమైన శక్తి ఒకటి ఉన్నది అన్న ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ చెప్పినది అక్షర సత్యం అన్నదానికి ఉదాహరణ విశాఖపట్నంలోని బురుజు పేటలో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారు.
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో గోపురం ఉండదు బహిరంగ ప్రదేశంలోనే భక్తులకు దర్శనం లభిస్తుంది. పూర్వము విశాఖరాజుల బురుజు ఈ ప్రాంతంలో ఉండదని అందుకే ఈ ప్రాంతానికి బురుజు పేట అని పేరు వచ్చిందని చరిత్ర కారులు తెలియచేశారు.
అమ్మవారు స్వయంభూ, ప్రజలే కుంకుమ, అర్చనలు స్వయంగా చేసుకోవచ్చును. పూర్వము అక్కడి నూతిలో ఈమె లభ్యమయితే రోడ్డు మధ్యన ప్రతిష్టించారని1917లో రోడ్డు విస్తరణ జరిగి అమ్మవారిని తొలగిస్తే ప్లేగు వ్యాధి ప్రబలి ఎందరో చనిపోయారని అందువల్ల తిరిగి ప్రతిష్ట చేసారని తెలియచేశారు. మరొక దృష్టాంతం కాశీ వెళుతూ బురుజు పేటలో బావిలో స్నానం చేసినప్పుడు అమ్మ తనని తీసి ప్రతిష్టించమన్నప్పుడు కాశీనుంచి వచ్చి ప్రతిష్టిస్తానంటే అమ్మ కోపిస్తే పరమేశ్వరుడు ఆమె వామ హస్తమును ఖండించించినాడాని అందువల్ల ఆమె శాంతించినదని కథనం.
పిల్లలు లేని ఎంతమందికో పిల్లలను అనుగ్రహించారు. డాక్టర్లు కూడా లాభం లేదన్న ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు. గొడ్డలితో పోయే వాటిని గోటితో సరిచేసిన సంఘటనలు, పిల్లలను అమ్మవారికి చూపించి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లైన క్రొత్త దంపతులు కొంగుముడితో వచ్చి వేడుకుంటే మరుసటి సంవత్సరానికి పిల్లలు కలగడం. మార్గశిర మాసం అమ్మవారి ఉత్సవాలు మార్గశిర లక్ష్మివారవ్రతములు అమ్మవారికి ప్రీతి. నిత్యాన్నదానపథకంతో దేవాలయసిబ్బంది భక్తుల ఆకలి తీర్చెదరు. దేశ,విదేశాలనుంచి కూడా ఎందరో వచ్చి దర్శనం చేసుకుంటే వారి కోరికలు తీరిన దృష్టాంతాలు చాలా కలవు. అందుకే కనకమహాలక్ష్మి అమ్మ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. భక్తుల కొంగు బంగారమే అన్నది అక్షర సత్యం…!!

ఇది నా అనుభవ, విన్న చూసిన ఘటనలు ఆధారంగా వ్రాసినది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!