నిర్మానుష్యం

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

నిర్మానుష్యం

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఉదయం 6 గంటలు. కళ్లు తెరిచాను. తల పక్కకు తిప్పి చూస్తే అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఎవరినీ డిస్ట్రబ్ చేయకుండా, కిటికీ దగ్గరకు వెళ్లి నుంచుని ఉన్నాను.

అబ్బా ఎంత అందంగా ఉంది ఆ లోయ. ఎత్తైన కొండలు పై నుంచీ పడే జలపాతం. నురగలాంటి ఆ నీరు పాల తెలుపు రంగులో ఉంటే, లెలేత సూర్య కిరణాలు ఆ నీటి పై పడి ఒక బంగారు జలపాతాన్ని తలపిస్తోంది ఆ దృశ్యం.

వెనక నుంచీ వచ్చి కళ్లు మూసి నవ్వుతోంది శ్రావ్య.

వోయ్, స్రావ్స్, లీవ్ మి అన్నాను. నవ్వుతూ…

ఎలా కనిపెట్టెసావే అంది.

నేను లేచేసరికి ఎవరూ లేవలేదు. నువ్వు మాత్రం మంచం పైన లేవు. వాష్ రూమ్ నుంచి వచ్చి, నన్నే ఏడిపిస్తావా? అన్నాను. దాని చెవ్వు మెలిపెట్టి.

అమ్మో, నీతో కష్టమే అంది నవ్వుతూ…

ఇద్దరం కలసి టీ కోసం కాంటీన్ కి వచ్చాము.

అక్కడ అప్పటికే మా కాలేజ్ కోతి గ్యాంగ్ అంతా చేరిపోయారు. వాళ్లతో మేమూ జాయిన్ అయ్యాము. ఈ పిక్నిక్ లో భాగంగా  ఊటి లో ఎక్కడ ఎక్కడకీ వెళ్లాలి అనే ప్లాన్ జరుగుతోంది అక్కడ.

కొందరు ప్రకృతి అందాలు ఉండే ప్లేస్లు చెపితే, మరికొందరు యుఖ్తి, ప్రయుక్తులతో పోటి గా ఉండే. ప్రదేశాలు చెపుతున్నారు.

ఏది ఎమైనా మనం ఎంజోయ్ చెయ్య టానికి కదా వచ్చాము. కనుక డేంజర్ ఏమి లేకుండా చూద్దాము అనే ఆలోచనతో అందరూ ఏకీభవించారు.

మా సార్, మా మేడమ్ కూడా భార్యాభర్తలు. అందునా రిసెంట్గా మారెజ్ అయ్యింది వాళ్లకి. కనుక వాళ్లు కూడా అలాంటి లవ్లీ  ప్లేస్ లే ప్రిఫర్ చేశారు.

అందరం కలసి 8 గంటలకల్లా టూరిస్ట్ వాన్ ఎక్కాము. చుట్టూ పచ్చటి చెట్ల మధ్యన సన్నని రోడ్ పైన మా వాన్ కదులుతూ ఉంది. అందం అంటే ప్రకృతే అనేంత సుందరంగా ఉంది ఊటీ నగరం.

మొట్ట మొదటగా, బొటానికల్ గార్డెన్ కి వెళ్లాము. మేమంతా బోటనీ స్టూడెంట్స్ అవ్వటం వల్ల, ఆ టూర్ మాకు బాగా ఉపయోగపడుతుంది. ఎన్ని రకాల మొక్కలు. ప్రతీ మొక్కకీ ఒక ప్రత్యేక మైన వాసన. ఎంతో అద్భుతంగా ఉండే రక రకాల పువ్వులు.

అటు తర్వాత, రోజ్ గార్డెన్ కి వెళ్లాము. రకరకాల రంగుల లో నాకు ఇష్టమైన  గులాబీ పూలు. మైమరచి చూస్తున్నాం.

ప్రకృతి ఆరాధనలో పడి, నన్ను మర్చిపోతున్నావు. మార్నింగ్ నుంచీ అసలు నా వైపు కూడా చూడట్లేదు అంటూ వచ్చాడు అమన్.

అదేం లేదు అమన్, చాలా చాలా బాగుంది ఊటి అన్నాను తమకంగా దగ్గరలోని ఒక పువ్వును తాకుతూ.

అయితే మన పెళ్లి అయ్యాక, ఫస్ట్ మనము ఇద్దరం కలసి వచ్చే, మొదటి ప్లేస్ ఇదే అన్నమాట అన్నాడు నన్ను చూసి నవ్వుతు.

హే, పో… అందరూ ఉన్నారు. ఎవరైనా వింటే, వెళ్ళే వరకు ఆట పట్టిస్తునే ఉంటారు అన్నాను కొంచెం సిగ్గుపడుతూ.

అప్పటికే నన్ను అంటి పెట్టుకుని ఉండే మా శ్రావ్య మమ్మల్ని చూసి, ఎంటే కాబోయే భార్య, భర్తలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒంటరిగా అంది.

కాబోయే కాదు, సగం భార్యాభర్తలు అయిపోయారుగా. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, అంటే సగం పెళ్లి అయిపోయినట్టే అంటూ వచ్చాడు శ్యామ్.

ఇక అక్కడ ఉంటే, ఏడిపించేస్తారు కోతి మొహాలు అందరూ  అనుకుంటూ, ఇద్దరం చెరొక వైపుకి వెళ్ళిపోయాము.

అక్కడ నుంచీ, రోజుకి ఒక్కొక్కటి చొప్పున, టీ ఫ్యాక్టోరి, పురాతన చర్చి, బొట్ హౌస్, త్రేడ్ గార్డెన్ అన్నీ చూశాము. అసలు ఒక్కొక్కరు అయితే, జీవితంలో మరచిపోలేని ట్రిప్ గా దీన్ని వర్ణించుకుని మరీ డైరీలో రాసుకున్నారు.

అందరం అన్ని రోజులూ  అలసిపోయిన ఆనందంలో, హైదరాబాద్ కు  తిరుగు ప్రయాణం అయ్యాము.

ఒకరోజు మొత్తం ప్రయాణం. మద్యలో లంచ్ కోసం వాన్  ఆగింది. అందరం భోజనాలు చేసి, అలా చుట్టూ చూద్దామని వెళ్లాము. నేను, అమన్ కలసి ఇక్కడ ఉన్నాము అని, మా ఫ్రెండ్సు అందరు వేరే చోట నుంచుని చూస్తున్నారు.

ఒక ప్లేస్ లో కొండల పై నుంచీ నీరు ప్రవహిస్తూ, కింద ఉన్న జలపాతం లో కలుస్తుంది. ఆ నీరు స్వచ్ఛంగా ఉండి, అడుగున ఉన్న ఆకుపచ్చ మొక్కల అందాన్ని పెంచుతోంది. అంతే కాక, చిన్నచిన్న , రంగురంగుల పువ్వులు నీళ్లల్లో, అదీ నీటి అడుగు బాగానా ఎండ పడి మెరుస్తున్నాయి.

ఆ పువ్వు ఒకటి కోసుకుందాము అన్న తుంటరి ఆలోచన మదిన విరియగా, అందుబాటులో ఉన్న పువ్వు కోసం, నుంచున్న చోటు నుంచి, కొంచెం ముందుకు వంగి, ఆ నేల తడి వల్ల జారి లోయలో పడిపోయాను. నన్ను పట్టుకోబోయి అమన్ కూడా లోయలో పడిపోయాడు.

ఇద్దరం దగ్గరగానే ఉన్నా, ఆ నీటి ప్రవాహం వేగంగా రావడంతో, చెరుకొలెనంత దూరం మా మద్యన. తన వైపు  చూస్తూ ఉంటే, ఆ నీళ్ల కదలికలో ఇంకా ఎక్కువగా దూరం వెళ్లిపోతున్నాను అని తెలిసింది. అమన్ కి మాత్రం ఒక పెద్ద రాయి ఆసరా దొరికింది.

నేను మాత్రం, ఆసరా కోసం వెతుకుతూ, మా పక్కనే, గట్టు పైన ఉన్న  ఒక చెట్టు ఊడని గట్టిగా పట్టుకున్నాను. ఆ నీటి వేగానికి తట్టుకోలేక పోతున్నాను. అరచెయ్యి మంట వచ్చేస్తుంది. అలాగని, నేను దాన్ని వదలలేను. వదిలితే, కింద అంతా లోయ.

అమన్ కి ఆ రాయి కొంచెం కదిలినా, చెయ్యి జరిపినా కూడా  నా స్తితికి తను వస్తాడు. అంటే ఇద్దరం నిలువెత్తు నీళ్ళల్లో,  ప్రమాదంలోనే ఉన్నాము. మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ ఎవరూ కనీసం ఇటు వైపు చూడట్లేదు. వాళ్లకు ఎం తెలుసు మా పరిస్తితి.

నేనే ధైర్యం తెచ్చుకుని, నా చేతిలో ఊడ ఏ చెట్టుదో చూసాను. అది ఇంచుమించుగా, అమన్ కి కొంచం దగ్గరగా ఉంది. ఆ ఊడని బాగా బలంగా లాగి ఉంచాను. చెట్టు కొంచెం ముందుకు వంగింది. అమన్ వెంటనే, ఒక కొమ్మ ఆసరాతో, చెట్టు పైకి ఎక్కాడు.

ఇంకా, అదే ఊడ తో, నేను ఒకే ఒక్క ఊపుతో, ఒడ్డుకు చేరాను. నా అరుపులు విని, మా ఫ్రెండ్సు అందరు వచ్చి, ఎలాగో, అమన్ ని కిందకి దింపారు.

అరెయ్ ఏదో  కాబోయే కపుల్ కదా, ప్రైవసీ ఇద్దామనుకుంటే, మీరు ఎంట్రా, సాహస కార్యాలు మొదలు పెట్టారు అంటూ ఒకటే గోల పెట్టారు మా కోతి గాంగ్.

అందుకే అంటారు… సంతోషమైనా, విచారమైనా పంచుకునేందుకు పక్కన మన వాళ్ళు ఉండాలి అని.

అదే, మేము ఫ్రెండ్సు అందరితో పాటు ఉండి ఉంటే, మాకు ఈ పెద్ద ప్రమాదం జరిగేది కాదు. అందుకే, నలుగురితో నారాయణా అనాలి.

నేటి కాలం లో, చిన్నాపెద్దా, ఆడా మగా, ఎవరైనా సరే,  ప్రైవసీ పేరుతో, చిన్న చిన్న ఆనందాల కోసం ,  అయిన వాళ్ళ కి దూరమై పెద్ద పెద్ద ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

ఆ భాద ఎవరికి చెప్పుకోలేక, చెడు అలవాట్లకు బానిసలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. నలుగురితో ఉన్న ఆనందం, ఒకరం ఉంటే ఉండదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!