దేవుడు మళ్లీ ప్రత్యక్షమైతే

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

దేవుడు మళ్లీ ప్రత్యక్షమైతే

రచన : కందర్ప మూర్తి

నగరంలో శేఠ్ పన్నాలాల్ మంచి పేరున్న బంగారు నగల
వ్యాపారి.ఎక్కువ లాభం ఆశించకుండా నిజాయితీగా వ్యవహ
రిస్తాడని కష్టమర్ల నమ్మకం.
కష్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతూ వ్యాపారాన్ని అభివృద్ది
చేస్తు తను ఆర్జించిన డబ్బులో కొంత దైవకార్యాలకు దాన
ధర్మాలకు ఖర్చు చేస్తుంటాడు.
శేఠ్ ఉదయాన్నే దేవాలయానికెళ్లి దేవుడిని దర్సించుకుని
దారిలో పక్షులకు తిండిగింజలు వేయడం అలవాటు.
కాలచక్రంలో పన్నాలాల్ శేఠ్ వృద్ధాప్యంలో పడినందున
నగల వ్యాపారం కొడుకుల కప్పగించి విశ్రాంత జీవితం
గడుపుతున్నాడు.

శేఠ్ దైవ భక్తుడైనా తోటి స్నేహితుల సాంగత్యంతో మద్యానికి
బానిసయాడు. పండగ పర్వదినాల్లో మాత్రం నిష్ఠగా ఉంటాడు.
రోజూ ఉదయాన్నే దేవాలయానికెళ్లి భగవంతుని దర్సనం
చేసుకుని క్రమం తప్పకుండా సాయంకాలం వైన్ బార్ కెళ్లి
మిత్రులతో మద్యం సేవించడం అలవాటు.
ఒకరోజు దేవుడు శేఠ్ చేసే ధర్మ కార్యాలకు, తన యందు గల
భక్తికి మెచ్చి ఏదైనా మేలు చెయ్యాలనుకున్నాడు. రాత్రి శేఠ్ పడుకుని ఉండగా లేపి ” భక్తా! నాయందు గల నీ భక్తికి
ఆనందించితిని. నువ్వు వార్ధక్యంలో పడ్డావు.భవిష్యత్తులో
వయసురీత్యా నీకు రెండు రోగాలు సంక్రమించే అవకాశం
ఉంది.
మొదటిది చెయ్యి వణుకుడు రోగం, రెండవది మతిమరపు
రోగం సంక్రమిస్తాయి. నువ్వు నా భక్తుడివి కనక ఒక రోగం
నీకు రాకుండా వరమిస్తున్నాను. ఏది కావాలో కోరుకో ”
అన్నాడు దేవుడు.
ఆ సమయానికి శేఠ్ కు ఏది కోరుకోవాలో పాలుపోలేదు.
వెంటనే లేచి దేవుడికి నమస్కరించి ” దేవా ! క్షమించండి.
నాకు కొంచం సమయం ఇవ్వంండి. ఆలోచించి చెబుతాను”
అన్నాడు వినయంగా.
” అలాగే , ఆలోచించి నీ నిర్ణయం తెలియ చేయి ” అని
అదృశ్యమయాడు భగవంతుడు.
తెల్లారింది. ఎప్పటిలా పవిత్రంగా దైవ దర్సనం చేసుకుని
సాయంకాలం రోజులా ఊర్వసి బార్ కి చేరుకున్నాడు శేఠ్.
మిత్రులతో కూర్చుని విస్కీ బాటిల్ మూత ఓపెన్ చేసి
గ్లాసులో పోస్తు రాత్రి నిద్రలో దేవుడు ప్రసాదించిన వరాల
విషయం చెప్పి వారి అభిప్రాయం అడిగాడు.
అందుకు పన్నాలాల్ శేఠ్ ఆప్త మిత్రుడు కలగ చేసుకుని
” మిత్రమా! ఈసారి దేవుడు మళ్లీ ప్రత్యక్షమైతే వణుకుడు రోగమే కోరుకో. పోతే కొద్ది మాత్రమే మందు తరుగుతుంది.
అదే మతిమరపైతే మొదటికే మోసం”అని తగిన సలహా
ఇచ్చాడు. మిగతా మందుబాబులు కూడా ఆయన సలహాకే
ఓటు వేసారు. ఇప్పుడు శేఠ్ కి మనశ్శాంతి అయ్యింది.
మర్నాడు శేఠ్ పన్నాలాల్ తుంటరి కోరిక తెలుసుకున్న
దేవుడు మనసులో నవ్వుకున్నాడు.

* * *

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!