ఓ నా సాహిత్య కలమా

ఓ నా సాహిత్య కలమా

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

ఓ నా సాహిత్య కలమా!
ఓ నా ప్రియ నేస్తమా ! నీచే నే వ్రాసే ప్రతి అక్షరం
సుందరం నీచే నే చూపే ప్రతి భావం ఓ అద్భుతం
నీ నుండి జాలువారు ప్రతి పదం రస రమ్య హృద్యం, నే కలగన్న ప్రతి కల, కవిత గా చూపాలనే ఆరాటం, కలం కదలనంటోందే, కాగితం పలకనంటోందే.నాలో వెలిగే భావ కెరటాల కిరణం
కాలానికి అందని కలం వేగం, ఊహలలో ప్రజ్వరిల్లిన కవిత్వం, ఆలోచనలకు లేదే అంతం, నాలో పలికే కవితా గానం.
ఓ నా సాహిత్య కలమా!
నీవు అక్షరం వర్షించే కవితా మేఘం, పదం లో దాగిన మెరుపుల ముత్యం,నా హృదయ ప్రతిబింబం నీవు,
నీవు
ప్రశంశలను కురిపించే కలం
కలం తో సృష్టించెను సాహితీ లోకం
కలం లేక సృష్టి యే శూన్యం
సమస్యల పై పోరాడే ఆయుధం
ఊహలకు తెచ్చెను సుందర రూపం
కలం కత్తి కన్న బలం
విప్పెను సాహితీ గళం
ప్రపంచాన జేజేల మయం, నా కవిత్వం తో ప్రపంచాన్ని జయించాలని కంకణం కట్టుకున్న,
కలం నుండి జాలు వారే అక్షర ప్రేమికురాలిని.

అందుకో నా ఈ సాహిత్య ప్రేమ లేఖని

You May Also Like

4 thoughts on “ఓ నా సాహిత్య కలమా

  1. నిజమే విద్య గారు o చక్కని సాహిత్యకలం మీది
    😊👌👌👍😊😊

  2. బాగుంది శ్రీవి ద్య గారు. సాహితీ లోకాన వెలగాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుతున్నా

  3. బాగుంది విద్య కవితా సాహిత్య ప్రేమలేఖ..
    ఎలా వస్తాయి ఇలాంటి వినూత్న ఆలోచనలు
    👌👌👌👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!