నాడు – నేడు
రచన:- జి.ఎల్.ఏన్.శాస్త్రి
నాడు..
పొద్దుటివేళ పల్లె పుడుతుంది,
కొక్కోరోకో కోడి మేలుకొలుపులు,
కోకిల కిలకిలా రావాలు,
భానుడి నులివెచ్చని కిరణాలు,
తలలూపుతున్న పైరులు,
నెమ్మదిగా పారేసెలఏటి గలగలలు,
గాలికి ఎగిరే పైరులు ..
పంచుకొని పెంచుకొనే ఆత్మీయ అనుబంధాలు,
కష్టమొస్తే ఆదుకునే తోటి మనుషులు,
గుడి గంటల గణగణలు,
నాగరికత ముసుగు వేసుకొని,
ప్లాస్టిక్ నవ్వులు లేని ప్రపంచం,
నేడు..
పల్లె పట్టణానికి దాసిఅయిపోయింది
మృదుత్వాన్ని వదిలేసింది,
సెల్ఫోను బానిసయ్యింది,
రాజకీయ రంగులు పులుముకొని,
తన అసలురంగు కోల్పోయింది,
అన్నీ ఉన్నా ఏమీలేని ఒంటరయ్యింది.
ఒక మొక్క నాటండి కాస్త ఊపిరి నివ్వండి,
నాటిలాగే నేడూ పల్లె మల్లెచెoడులా .
సువాసనలు గుబాళిస్తుoది.
***