తెలిసొచ్భిన భార్య విలువ

తెలిసొచ్భిన భార్య విలువ

రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

 పడక కుర్చీలో వెనక్కి తలదాల్చి జారబడ్ఝడాడు రాజశేఖరం.ప్రక్క గదిలో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయిఅవి ఆయన ఇద్దరి కోడళ్ళ మాటలు ఆయన ఇద్దరి కొడుకులతో మాట్లాడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు చూడాలండీ మీ నాన్నగారిని మీ అమ్మగారు చనిపోయి రెండు నెలలౌతుంది. ఆలాకూర్చోవడం ,పడుకోవడం,టైముకి తినడం ,ఏం గుండ్రాయిలా బానే ఉన్నారుగా ఎక్కడైనా ఏ వాచ్ మాన్ గా నైనా చేరి మీకు గానీ ,లేదా బజారుకు వెళ్ళి కూరగాయలు,సామాన్లు తెస్తూ మాకు గానీ సాయపడొచ్చుగా అలా కూర్చుని తింటే ఎలా కుదురుతుందీ ఇప్పటివరకు పోనీలే అని అలాగే చూసాం కానీ ఇక నుండి చూసే ఓపిక మాకు లేదు ఏం చేస్తారో మీ ఇష్టం మీరు చెప్తారా లేదా మమ్మల్నే చెప్పమంటారా అన్నారు ఇద్దరూ ముక్త కంఠంతో.
దానికి వాళ్ళ భర్తలిద్దరూ మా నాన్నగారిని అలా అంటారేమిటి అని ఒక్కమాట కూడా అనకుండా సరేలే మేమే చెప్తాము అన్నారు. ఆ మాటలు విన్న రాజశేఖరానికి తన భార్య అనసూయ గుర్తొచ్చింది తను ఏనాడైనా నా ముందు అలా ఆర్డర్ వేసినట్టు మాట్లాడడం జరిగినదా, నేను ఏనాడైనా తనను కనీసం మనిషిలాగైనా చూసానా అనుకుంటూ మనసు జ్ఞాపకాల దొంతరలు తిరగేస్తుంది ఒక్కొక్కటిగా.

***

రాజశేఖరం పెళ్ళి అనసూయతో ఘనంగా కాకపోయినా ఏదో పరవాలేదు అనిపించేలా జరిగిపోయింది..క్రొత్త కోడలిని చూడడానికి వచ్చిన వారంతా మా రాజశేఖరం పెట్టి పుట్టాడు కాబట్టే చక్కని చుక్క భార్యగా వచ్చిందని పొగిడారు.వారం షదిరోజులు గడిచిన తరువాత అందరికీ తెలిసిందేమిటంటే అనసూయ రూపవతియే కాదు గుణవతి కూడా అని .అనసూయ ఎప్పుడూ నవ్వుతూ , భర్తకి మంచి సలహాలిస్తూ ఉండేది. రాజశేఖరం మాత్రం ఎప్పుడూ భార్య మీద చిర్రుబుర్రులాడుతూ ఉండేవాడు ఇంక అనసూయ సలహాలిస్తే మాత్రం చేయి చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు అనసూయ మాత్రం .తను చేసిన తప్పేంటోఅర్ధం కాక లో లోపలే మూగగా రోదిస్తూ పైకి మాత్రం అందరినీ నవ్వుతూ పలకరించేది. అలా వారి జీవితం సాగుతుండగా వారికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
రాజశేఖరం బయట అందరి దగ్గర , ఇంట్లో పిల్లలిద్దరి దగ్గరా నవ్వుతూ మంచిగానే ఉండేవాడు కానీ అనసూయను చూస్తే మాత్రం ముఖము సీరియస్ గా మార్చేసేవాడు. అదే విషయమై భర్తని అనసూయ ఖరా తీయగా తను వాళ్ళ మేనమామ గారి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నానని అలా కాకుండా నిన్ను చేసుకున్నాను నా ఖర్మకి అని తన నోటితో తనే అసలు విషయం బయట పెట్టాడు రాజశేఖరం. అది విన్న అనసూయ ఇదంతా నా ఖర్మ అనుకుంటూ పిల్లలకోసం భర్త ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా భరిస్తూ కనీసం పుట్టింటి వారికీ కూడా చెప్పకుండా గుట్టుగా కాపురం చేసేది .
బయట అందరి ద్వారా గొప్పదని మన్ననలు పొందుతూ కన్న పిల్లలూ ,చివరకి అత్త మామలూ. అత్తింటి తరపున చుట్టాలందరితోనూ మెప్పు పొందుతూ భర్త చేత చీత్కారాలకు బాధ కలిగి అప్పుడప్పుడూ భర్త దగ్గర నేను ఉన్నంతకాలం మీకు నా విలువ తెలియదు .నేను చనిపోయాకే తెలుస్తుంది నా విలువ అనే ఒక్కమాట మాత్రం అనేది. ఇంక భర్త దగ్గర నవ్వడం, సరదాగా ఉండడం ,సలహాలివ్వడం మానేసింది అనసూయ

రాజశేఖరం పోగొట్టుకున్నాను ,పోగొట్కున్నానని ఆలోచిస్తూనే వారి దాంపత్యంలో ముప్పది సంవత్సరాలు గడిచిపోయాయి ఆర్నెల్లు తేడాలో పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసారు. మరో ఎనిమిది నెలలకు అనసూయ కాలం చేసింది సడన్ గా అలా జరగడాన్ని డాక్టరైతే హార్ట్ ఎటాక్ అన్నారు .కానీ వీళ్ళ విషయం తెలిసిన కొడుకులు కోడళ్ళు మాత్రం మనోవ్యధకి మందు లేదు కదా అనుకున్నారు.అనసూయ శవాన్ని చూడడానికి వచ్చిన వారు ఏడ్చిన వారే గానీ ఏడవని వారు లేరు అది చూసి కూడా భార్య గొప్పతనాన్ని గుర్తింలేకపోయాడు రాజశేఖరం

రాజశేఖరానికి ఇప్పుడు తెలిసొస్తుంది భార్య విలువ భార్య చనిపోయి రెండు నెలలకే తన బ్రతుకు కుక్క బ్రతుకైపోయింది ఇంక గడవవలసిన కాలాన్ని తలచుకుంటే భయమేస్తుంది నువ్వు అన్నమాటలు నిజమే అనసూయ నీవు పోయాక తెలిసొస్తుంది నీ విలువ .అంటూ తన మనసులోనే కుమిలిపోతుండగా దూరంగా టి వి లో నుండి చిన్నగా వినిపిస్తుంది దొంగాట సినిమాలోని పాట “పోగొట్టుకున్నామనుకుప్నవారు పొందింది చూడలేరు”అని అది విన్న రాజశేఖరం నేను చేసినది అదే నన్ను క్షమించు అనసూయా అని మనసులోనే భార్యను క్షమాపణ కోరుకున్నాడు మనసులోనే ధారలుగట్టిన కన్నీటిని తుడుచుకుంటూ..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!