ఆ పాదాలకు అలసట లేదు

ఆ పాదాలకు అలసట లేదు

రచన: వడ్డాది రవికాంత్ శర్మ

ఆ పాదాలు ప్రకాశిస్తున్నాయి …
ప్రకాశాన్ని నా హృదయం పై పరావర్తనం చెందిస్తూ ..
అజ్ఞానపు మేథో ప్రపంచాన్ని …
అదే కాంతితో విజ్ఞానపు క్రాంతి దిశగా నడిపిస్తున్నాయి ….

ఆ పాదాలకు అలసటలేదు …..
బడిమెట్లు ఎక్కుతాయి …
గుడిమెట్లపై అర్చిస్తాయి …
అంతరిక్షశాస్త్రం అయినా …
ఆధ్యాత్మిక ప్రవచనం అయినా ….
సంసార జీవన సౌరభాలు పంచినా …
శాస్త్రీయ సిద్ధాంతాల అర్థాన్ని విప్పిచెప్పినా….

ఆ పాదాలకు అలసట లేదు ..
రామునితో కూడి అడవుల్లో నిలిచినా …
వ్యూహ కర్త కృష్ణుణ్ణి వ్యవహార శిల్పిగా మలిచినా….

ఆ పాదాలకు అలసట లేదు ….
చంద్రగుప్తుణ్ణి చక్రవర్తిగా చేసే దాకా …
అఖండభరతఖండానికి రాజనీతి నేర్పే అపర చాణక్య నీతిలాగా…..

ఉషోదయాన అర్చించాను ….
ఆశీస్సులు రోజంతా అందుతున్నాయి …
రాబోయే సవాళ్ళని ఏదిరీదే …
అనంత శక్తిని నాపై కురిపిస్తున్నాయి …

ఆ పాదాలకు అలుపు లేదు ….
అవి అపర గురు పరంపరకు చిహ్నం …..
ఆదిశక్తి ని తనలో నింపుకుని

ఆశీర్వదించే నిష్ఠకు చిహ్నం …
నమో నమః గురుపాదుకాభ్యామ్……

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!