హిట్లరా..తొక్కా!

హిట్లరా..తొక్కా!

రచన: తొర్లపాటి రాజు(రాజ్)

అందనంత ఎత్తు ఎదిగినా..
అవతారం చాలించక తప్పదు!

ఎక్కడున్నాడు?
నేడా..మహిమాన్విత మహావిష్ణువు!
కానారాదేమి నేడా అనంతమైన ఆదిశక్తి!
ఎందెందు వెదికినా..
కాన రాడేమి ఆ గరళకంటుడు!
ఏమైపోయాడు…
జగజ్జేత..ది గ్రేట్ అలెగ్జాండర్!

ఏరీ …
ఆ ..అపార పాండిత్య సంపన్నులు..
వేద వ్యాస..వాల్మీకి వాత్సాయానులు!
ఏ పండులో దాగిన్నాడు..
న్యూటన్ మహాశయుడు!
ఏ శక్తిగా మారిపోయారు..
ఐన్ స్టీన్ అయ్యగారు!

ఎవరి రక్తంలో కలిసిపోయాడు..
రక్త పిపాసి హిట్లర్!
ఎక్కడ సత్యాగ్రహం చేస్తున్నాడు..
గాంధీ మహాత్ముడు!

ఏమయ్యారు?
మన శ్రీమాన్ తాత ముత్తాతలు!

రక్త పిపాసి అయినా..
జగజ్జేత అయినా..
అనామకుడు అయినా..
ఆఖరికి ఆ అంతర్యామి అయినా..
అవతారం చెల్లించాల్సిందే!

పుష్పించిన పువ్వు..
వాడక మానదు!
చిగురించిన ఆకు..
రాలక తప్పదు!
ప్రాణమున్న ప్రతి జీవి…
పరమపదించక తప్పదు!

నాకేం!
కోట్ల సొమ్ముంది..
దిట్టమైన కోట గోడలున్నాయ్..
వేల ఎకరాల భూములన్నాయ్..
వేయంతస్తుల మేడలున్నాయ్..
అనుకునేవు!

పిచ్చివాడా!
నిన్ను సృష్టించిన..
వాడికే…నూకలు చెల్లాయి
నువ్వెంత?

పతనం తప్పదు అన్నపుడు..
పంతాలేల!
అంతం తథ్యం అయినపుడు..
అహంకారాలేల!
గోరి తప్పదు అన్నపుడు..
నేనే..నేనే..గొప్పని అనుకుందువేల!
దిన దిన గండమైనపుడు..
దినమంతా..దిగులుకే ఇచ్చెదవేల!

నొప్పి కలిగితే…
ధనికుడు కైన..
దారినపోయే..దానయ్య కైన ఒక్కటే
అనందమొస్తే…
అనాధకైనా..ఐశ్వర్య వంతుడకైన..
ఒకటే
చుట్టూ ఉన్న మనుషులు..
స్పందించే తీరులోనే…ఉంది తేడా!

మిత్రమా!
నీకున్న సమయం..
శరవేగంతో కరిగిపోతుంది!
కాబట్టి!
మనస్పర్ధలతో..ఆత్మాభిమానాలతో..
సమయాన్ని.. సావగొట్టక!

జీవితాన్ని…
ఆసాంతం..అంగీకరించి
ఆనందించు!
బాధ అయినా..
బాగుంటే..బందీ..అవ్వు
నచ్చకపోతే..
నక్షత్రాల గది అయినా
గడి పెట్టీ మరీ వచ్చేయ్!

మనిషి అంటేనే….
మనసు..
మనసుకు నచ్చినట్టు ఉండు
కాస్త..జాగరూకతతో ఉండు!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!