కోటి భావాల ప్రకంపన!

కోటి భావాల ప్రకంపన!

రచన: సుజాత.పి.వి.ఎల్

కోటి చంద్రుల చల్లదనాన్ని
నీ ప్రశాంత వదనంలో చూశాను..
కోటి మృదంగాల మృదునాదాన్ని
నీ పలుకులలో విన్నాను..
నీ స్వరం నా పేరు పలికిన ప్రతిసారి
ఇంద్రధనుస్సులో విరిసిన సప్త వర్ణాలను..
కోటి  స్వర వీణల మనోహర సంగీతంలా
ఆస్వాదించాను..
నీపై ప్రేమతో నిండిన నా హృదయం
కోటి భావ ప్రకంపనల సమ్మేళనం
అందుకే ఈ కవిత నీకంకితం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!