హరివిల్లు
రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి
అహో!రంగుల చిత్రం
పలువర్ణ వర్షపు దృశ్యం
ఇంద్రధనుస్సు తలుపుకు రాగా
హృదయానికది ఇంధనం కాగా
అలా..అలా.. ఎలాగో..
మది సరాగ మాలలో
తడిసిముద్దవ కోరిక రేగి
స్నేహ బృందం వెనుదిరిగె
చలాకి వయసున
హాయైన వర్షపు హోరులో
జోరైన హుషారు వేళలో
ఛత్రములా చేతిలో
పోదుము లోపల వొదిలేయంగా
మరలి వొచ్చెదము
ఓ!జడివానా
నీవెచటికీ జారిపోకు
చేతులు చేతులు కలిపి
చిందులు వేసెదమీపూటంతా