అంబరాన్నంటే సంబరము..!

అంబరాన్నంటే సంబరము..!

రచన: పిల్లి.హజరత్తయ్య

వెలవెలబోతున్న జీవితానికి వెలుతురై
గుండె గూటికి కొండంత ధైర్యాన్నిచ్చి
నీకు నేనున్నానని భరోసా నిచ్చే
అనురాగపు ఆత్మీయ బంధము..!

ప్రేమానురాగాలకు సూచికగా
సోదరి నిండు మనసుతో
సోదరుని ఎదుగుదలను ఆకాంక్షించి
కట్టే మమతల అనుబంధము..!

అక్కాచెల్లెళ్లు అన్నాదమ్ముళ్ళు మమేకమై
కుటుంబ విలువలకు పునాదులై
ఆత్మీయుల వాత్సల్య పరిమళాలతో
అంబరాన్నంటే సంబరము..!

ఎదలోతుల్లో గాయమైన తోబుట్టువులకు
చల్లని లేపనమును అద్ది
గుండె గూటికి స్వాంతన చేకూర్చే
అమృత హస్తము రక్షణబంధము.!

హరివిల్లు లాంటి అనుబంధాలను
తీయని జ్ఞాపకాలుగా మిగిల్చి
భవిష్యత్తుకు పూల బాటలు వేసే
తరువుల లతయే రక్షా బంధనము..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!