ఈల గోల

(అంశం :: “విమర్శించుట తగునా”)

ఈల గోల 

రచన::నాగమయూరి

అమ్మ చూడమ్మ నీ కోడలి ఆగడాలు

వాడు విజిలెయ్యగానే పరుగెడుతోంది

ప్రేమగ నే కబుర్లు చెబుతున్నా…

ఆకలితో పాపాయి ఏడుస్తున్నా..

చివరికి భక్తితో దేవుని పూజలే చేస్తున్న..

వదలక, అదరక,బెదరక వాడేమో ఈలలేసి పిలుస్తాడు

నీ కోడలు ఏమో పరుగెడుతూ వెళ్ళి పోతుంది.

నువ్వయినా చెప్పమ్మా నీ కోడలికి…/

మేము వధ్దంటే వినకుండా నువ్వే కదరా ఏరి,కోరి దగ్గరుండి ఇంట్లోకి తెచ్చావు

పుట్టినరోజు కానుకంటూ….
గ్యాస్ కూడా ఆదా అవుతుందంటూ..

ఆ ప్రెజర్ కుక్కర్ తెచ్చి దాని చేతులలో పెట్టి

ఇప్పుడేమో ఈల వేస్తోందంటూ, పరుగెడుతోందంటూ ఇల్లంతా గోలచేస్తూ

బంగారం లాంటి నా కోడలిని విమర్శించుట తగునా

You May Also Like

One thought on “ఈల గోల

  1. ఈలగోల … ఐడియా బావుంది.. ఇంకొంచం శ్రద్ద పెట్టి రాస్తే ఈల వెయ్యొచ్చు… అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!