(అంశం :: “విమర్శించుట తగునా”)
ఆలోచించండి
రచన::M.సుశీలరమేష్
అత్తా మరో ఇంటి కూతురి వే కదా!
అత్తా ఒకనాటి కోడలివే కదా!
అత్తా కోడలంటే కూతురితో
సమానం కదా!
అత్తా నీ కోడలు ముందు తరాన్ని అందించే అలివేణి కదా!
కోడలా అత్తంటే మరో అమ్మ కదా!
కోడలా అత్తలో అమ్మను చూడవచ్ఛును కదా!
కోడలా అత్తను అనుసరించి
మెళకువలు నేర్చుకోవచ్చును కదా!
మీరిద్దరు మీ స్వ పురుషులకు
రెండు కనులు వంటి వారు కదా !
మీరిద్దరూ స్నేహితులుగా
మెలగ వచ్చును కదా!
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు
అని చాటి చెప్పవచ్చును కదా!
మీరిద్దరూ మీ ఇంటికి దీపాల వంటి వారే కదా!
అంతటి ఉన్నత స్థానంలో ఉన్న
మీరిద్దరూ ఒకరినొకరు
విమర్శించు కొనుట తగునా!
**** సమాప్తం 🙏.