ప్రక్షాళన

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

ప్రక్షాళన

రచన: మహేంద్ర కుమార్

నాది కాని నేరానికి బందీనయ్యాను

నిజం రుజువు చాలక సతమతమౌతున్నాను

వాస్తవం తెలుసుకోలేని మనుషులతోనున్నాను

నిస్సహాయ చీకటిలో నివసిస్తున్నాను

సందేహాలు అలలై కెరటాల్లా ఎగసిపడుతున్నా

కన్నీటి సునామీని సృష్టిస్తున్నా

ఆశయాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నా

చేయూతనివ్వలేని మనుషుల మధ్యనున్నాను

మానవత్వపు ముసుగేసుకున్న మనస్తత్వాల మధ్య

నా అంతరంగ తరంగాలు ప్రశ్నిస్తున్నాయి

నిన్నునువ్వు ప్రక్షాళన చేసుకొని

గమనాన్ని సాగించగలవా అని?

గమ్యం చేరి చూపించగలవా అని?

You May Also Like

2 thoughts on “ప్రక్షాళన

  1. అభివృద్ధి సాధిస్తున్న అభ్యుదయ భావాలు కలిగిన మహేంద్రకుమార్, మరింత ముందుకు సాగాలని అభినందనలు.సులభ శైలిలో భావాలు వ్యక్తీకరిస్తున్నాడు.ఆతని ఆలోచన శైలి మధురం.దీవెనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!