మంచు ముత్యాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
సూర్య మాసమే మాఘ మాసము ప్రకృతి అంతా
మంచు ముత్యాలు పరచుకుని
సూర్య కిరణాల తాకిడికి కరుగుతు మెరుస్తూ
ఆహ్లాదంగా అందంగా ఆనందంగా ఉంటు
ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ
ఆదివారం రథ సప్తమి రోజు
జనులు జిల్లేడు ఆకు రేగి పండు స్నానం ఎంతో ఆరోగ్యం,
సూర్య కళ్యాణము పూర్ణిమ పూజలు ఎంతో పుణ్యము,
పాలు పొంగుతో ఆరోగ్యము
ప్రతి మాసంలో ఎదో విశిష్టత
మాఘము ప్రకృతి ప్రజా రక్షణ
క్షేమంగా అనురాగము
మంచుముత్యాల్లా కురుస్తూ ప్రతి ఉదయం