కాలంతో కలిసి

కాలంతో కలిసి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యువశ్రీ బీర

బిజీ బిజీ బిజీ….
ఎవ్వర్ని కదిలించినా బిజీ…
ఎప్పుడు చూద్దామన్నా బిజీ…!
గజిబిజి బతుకులు…
గందరగోళంలో జీవితాలు…
గమ్మత్తైన పోకడలు…!!
పరుగుపందెమే జీవితం…!
కాలంతో పోటీపడి
పరుగులు తీస్తూ…
ఎంతో ఎత్తుకెదిగి…
నేనేంటో అని నిరూపించుకోవడానికి…
కాలాతీతమవుతుందని తీసే పరుగులో…
కాలికిందపడి నలిగిపోతున్న బంధాలను ఒక్కసారైనా
చూస్తున్నామా…?
కరిగిపోయే కాలంలో అనుబంధాలు నీరౌతున్న
సంగతి గమనిస్తున్నామా.?
అన్నీ తెలుసనుకుంటాడు మనిషి…
కానీ ఏమి కావాలనుకుంటున్నాడో..
ఏమి సంపాదిస్తున్నాడో…
ఏమి కోల్పోతున్నాడో
ఒక్కసారైనా అవలోకనం చేసుకుంటున్నాడా…?
ఏమో…?
లేదనే చెప్పాలి మరి…!
ఎందుకంటే…
టైం అయిపోతుంది..
టైం అయిపోతుంది అంటూ…
మనం చూసే గడియారం కూడా తన పరుగులో…
మర్చిపోదుకదా ఏ బంధాన్ని కూడా.
తన వృత్తంలో తనే తిరుగుతూ…
తన అనుకున్నవారిని పలకరిస్తూ…
ప్రతి ఐదు నిమిషాలకోసారి తన బంధువులను తప్పకుండా కలుస్తూ..
హుందాగా కదిలే కాలానికి సెల్యూట్ చేస్తూ…
మనమూ మన బంధాలకు.. అనుబంధాలకూ విలువనిస్తూ…
మన బిజీని కాస్త పక్కనపెట్టి..
బంధాలను బరువనుకోక…
అనుబంధాలను ఆలింగనం చేసుకుంటూ…
జీవితాన్ని రసమయం చేసుకుంటే…
అంతకన్నా గుర్తింపు.. సంతృప్తి ఇంకేముంటుంది మరి…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!