ఏడు వర్ణాలు

ఏడు వర్ణాలు

రచన: చెరుకు శైలజ

ఆకాశం రంగుల చీర కట్టింది.
ఏడు వర్ణాల ఇంద్రధనుస్సు అందాలు చూసి అవని ఆనందపడి పోయింది.
మేఘలు మెల్లగా మెల్లగా కదులుతు మబ్బుల్లోకి వెళ్లి పోతున్నాయి.
మెరుపులు మెల్లగా ఇంద్రధనుస్సు ముందు వాటి మెరుపుని కోల్పోయాయి.
ఉరుములు ఉరిమి ఉరిమి ఉరుకొని ఇంద్రధనుస్సు రాకతో ఉరట చెందాయి.
ప్రకృతి హరివిల్లును చూసి పులకించిపోయింది
నెమలి పూరి విప్పి నాట్యం ఆడింది.
సెలయెరు ఇంద్రధనుస్సు నీడను నీటిలో చూసి అబ్బుపడింది.
ఇంద్రధనుస్సు ఏడు రంగులు ఏడు దిక్కు లలో దివ్యం గా వెలిగిపోయింది
ఉన్న కొంచం సేపూ అయిన ఎందరనో ఆనందం అంచుల్లోకి చేర్చింది.
ప్రతి మనిషి ఇంద్రధనుస్సు లా పదిమందికి ఆనందాన్ని పంచాలి.
ఎదుటి వారి సంతోషానికి తను కారణం కావాలి
అలా జీవితంలో హాయిగా సాగిపోవాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!