సప్త వర్ణాల  హరివిల్లు

సప్త వర్ణాల  హరివిల్లు

దొడ్డపనేని శ్రీ విద్య

సప్త వర్ణాల సుందర హరివిల్లు
అల గగనాన మెరిసే రంగుల ధనుస్సు

నులి వెచ్చని సూర్యరశ్మి నింగిన  మెరవగా
రంగు రంగుల  ఛాయలు స్వాగతం పలుకగా

ఆకశాన  రంగుల విహంగ వీక్షణం

వానొచ్చే మెరుపొచ్చే
నింగి నేల కలిసొచ్చే ఇంద్రధనుస్సు అంచున

ప్రేమ ఎంత మధురమో
చెలి నుదుటి కుంకుమ
సప్త వర్ణాల ఇంద్రథనుస్సు

రంగులెన్ని ఉన్నా
ప్రియుని మమతానురాగాలు
సప్త వర్ణాల ఇంద్రధనుస్సు

ఇంద్రధనుస్సులోని రంగులు
ఆకాశానికి ఇంద్ర భవనపు హంగులు

కవితలో అక్షరాల ఇంద్రధనుస్సు
భావాల హరివిల్లు లా వికసించు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!