బడి పిల్లలు

బడి పిల్లలు

రచన: కాకు మాధవిలత

చిని చిని చిని చిని బుడతల్లారా!
చిరు చిరు చిరు చిరు దివ్వెళ్ళారా
కరోనా రక్కసితో
మీ స్వేచ్ఛకు దూరం అయ్యారా!
మీ స్వేచ్ఛకు దూరం అయ్యారు!
బులి బులి బులి బలి కూనల్లారా
చెంగున ఎగిరే లేడుల్లారా
చిటపట చిటపట చినుకుల్లారా
బడులకు వెళ్ళే పాపల్లారా కరోనా రక్కసితో
చదువుకు దూరం అయ్యారా!
మీ చదువుకు దూరం అయ్యారా!
చిని చిని చిని చిని బుడతల్లారా
చిరు చిరు చిరు చిరు దివ్వెళ్ళారా
కళ కళ లాడే కాంతుల్లారా
కిలకిలమనే కోకిల్లారా
కరోనా రక్కసితో
వేడుకలకు దూరం అయ్యారా!
వేడుకలకు దూరంఅయ్యారా!
మరి ఏమిటి మార్గం? మరి ఏమిటి మార్గం?
ఇదే ఇదే మార్గం ఇదే ఇదే మార్గం
కణకణమనే కర్కసమైన ఈ కరోనాను
చితిమంటల్లో తొక్కేస్తాం
స్వేచ్ఛను పూర్తిగ పొందేస్తాం
ఆటలు చక్కగ ఆడేస్తాం
చదువులు చక్కగ చదివేస్తాంవేడుకలన్నీ చుట్టేస్తాం
ఎంతో హాయిగ సాగిపోదాం ఎంతో హాయిగ సాగిపోదాం
చిని చిని చిని చిని బుడతల్లారా
చిరు చిరు చిరు చిరు దివ్వెళ్ళారా

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!