సూక్తులు

సూక్తులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:కాటేగారు పాండురంగ విఠల్

జీవి జీవిలో దేవుడిని చూడుము
అణువణువు నుండి జ్ఞానం పొందుము
ఓటమి గుణపాఠంగా భావించుము
నీ భయమే నీ పతన కారణము
గర్వమనర్థహేతువని తెలుసుకో విఠల!

నీ భావాలే నీ లక్ష్యం ఆదేశిస్తాయి
నీ కర్మలే నీ గమ్యం తెలుపుతాయి
నీ యోచనలే నీ మార్గం చూపుతాయి
నీ కాంక్షలే నీ కార్యం నిర్దేశిస్తాయి
నీకు నీవే శత్రువు మిత్రుడవు విఠల!

కష్టపడ్తే మూర్ఖుడు మేధావగును
సోమరైతే మేధావి మూర్ఖుడవును
ఉలి దెబ్బతో శిల శిల్పమవును
శ్రమిస్తే పేదోడు సంపన్నుడవును
గర్వం మనిషిని పతనం చేయును విఠల!

ఉదాయిస్తే అస్తమించక మానదు
జన్మిస్తే మరణించక తప్పదు
ఆకు చిగురిస్తే రాలక తప్పదు
పున్నమి అమాస అవ్వక తప్పదు
జీవితం చక్ర భ్రమణమే కదా విఠల!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!