మా మంచి అమ్మమ్మ

మా మంచి అమ్మమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

మామిడిపల్లిలోని
మావుళ్ళమ్మ గుడిదారి
మామిడి తోటమధ్య
మా అమ్మమ్మ ఇల్లు
మా బాల్యంలో స్వర్గమే!

పండుగ రోజుల్లో
పట్టుపరికిణి కట్టి
పరవశంతో మురిసి
పసిడి బొమ్మలావున్నావే
పావని అని ముద్దు పెట్టి
పాపారావు గాడి కొట్లో
పలకను కొనమని తాతయ్యతో చెప్పి
పంతులు గారిచే సరస్వతి పూజచేయించి
అక్షరాభ్యాసం చేసిన అమ్మమ్మ
పార్వతిదేవి ప్రతిరూపమే.!

పరమాన్నం నివేదన అనంతరం
ప్రసాదం పంచిపెట్టి
పక పక నవ్వుతున్న
నన్ను ఎత్తుకుని తాతయ్యతో
పసిపిల్లలు పరమాత్ముని
ప్రతిరూపాలే అన్న
మా మంచి అమ్మమ్మ
నాకెంతో ఇష్టం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!