మల్లె వంటి మనసు మాది

మల్లె వంటి మనసు మాది

రచన: శిరీష వూటూరి

పువ్వులం మేం పువ్వులం
బడి వాకిట గుమ్మానికి
బంతి పూల తోరణాలం…..

మల్లె వంటి మనసు మాది
కోపగిస్తే చిన్నబుచ్చుకుంటాం
ప్రేమతోని నచ్చ చెపితే
గులాబీ పువ్వులా వికసిస్తాం

సీతాకోకచిలుకల్లాగా బడి
అంతా కలియ తిరుగుతాం
పువ్వులోని హొయలన్ని
మా చిరునవ్వులో చూపిస్తాం

పరిమళాలు వెదజల్లుతూ
బడి అనే పూదోటలో
వికసించిన పసిడి మొగ్గలం
చక్కనైన చామంతులం….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!