పీలికైన జీవితాలు

పీలికైన జీవితాల

రచన: నెల్లుట్ల సునీత

తాతల తండ్రుల నాటి కులవృత్తినే ఇంటి ఇలవేల్పుగా కొలిచి శ్రమ ఫలాల వరాలను పొందే //

దర్జీల హస్త సూచికలు జాడ లేక వీధులన్నీ చిన్నబోయే నేడు../

మేధ మెరుగులు దిద్దిన పారిశ్రామిక మేడలలో పెనుగాలికి కుప్పకూలిన
కులవృత్తులు /జీవితాన్ని దగా చేసినా

బ్రతుకు బండిని హృదయ భారంతో ఈడుస్తూ…/)
ఓర్పుతో నేర్పును చేకూర్చినా… కదలని కాల చక్రం..//

పీలికైన బతుకు ముక్కల్ని
ఆకలి వేళ్లతో అందంగా అతికించి
అందమైన ఆహార్యానికి రూపాన్నిచ్చి మురిసిపోయే అమాయక సృజనశీలులు//

త్యాగాలను బలి పెడుతూ
నీరస నాడీమండలంతో బతుకు పోరాటం చేస్తూ//
పగలనక రేయనక మిషన్ గిరక తిప్పినా గాని గడవని జీవితాలు చెరిగిపోని ఖాతాలు//

దర్జీ కంటనీరు ఏ దయార్థ కనులు చూసేను//
పొక్కిలైన వాకిళ్ళలో పొర్లి పోయిన కన్నీళ్లను ఏ కడవలో నింపుదురు//
సాంకేతికను స్వాగతించి సహకారం మరిచిపోయి//

బతుకుదెరువు మనిషితనం మరిచితిమి
అంచనాలకు అందనీ సంకేతాల కొలతలలో
చిరిగిన చిత్రాలు ఏ కొలతలలో ఇమిడిపోతాయి/
పారిశ్రామికీకరణ పట్టంతో
చిదిమేసిన దర్జీల జీవితాలు//

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!