మారిన మనిషి

మారిన మనిషి

రచన: చెరుకు శైలజ

నరసింహ రాయుడు బంగాళా ముందు ధ్యానాన్ని పట్నంకి పంపడానికి బండిలో బస్తాలను
పనివాళ్లతో ఎక్కిస్తున్నాడు. అంతా గోల గోల గా ఉంది. ఇంట్లో జానకి తన పది ఏండ్ల కొడుకుకు బాగోలేక పక్కనే కూర్చుని సపర్యలు చేస్తుంది.కొడుకు మూసిన కన్ను తెరవడం లేదు. భయంగా మంచం దగ్గరే ఉన్నది. ఇప్పటికి మూడు రోజులు అయింది. పట్నం దవాఖానా తీసుకెళ్దాం అంటే రాయుడు ఊరిలో ఉన్న చెట్ల మందు వైద్యునితో తగ్గి పోతుంది లే అంటు పిలిపించి వైద్యం చేయిస్తున్నాడు.ఆ వైద్యం మొదలు పెట్టినప్పటి నుండి ఇంకా ఎక్కువ గా అనిపిస్తుంది. జానకి ఏమి చేయలేక బాధపడుతుంది. రాయుడికి ఎప్పుడు పంటలు, డబ్బులు ముఖ్యం.అదే పనిలో ఇంట్లో ఉన్న సంగతి మరచి పోతుంటాడు. ఎందుకు దండిగా డబ్బులు ఖర్చు పెట్టడం పట్నం తీసుకెళ్ళడం అని భార్యతో చెప్పి ఊరిలో వైద్యమే ఇప్పిస్తున్నాడు.ఆ ఊరి వైద్యం తోనే ఇప్పటికి అనారోగ్యం తో ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుంది. ఈ బిడ్డ కూడా ఏమైనా అయితే తాను బతుకగలదా, ఆ ఇద్దరు బిడ్డలు పోయిన తరువాత ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తే పుట్టిన నా కొడుకు బాధతో ఆలోచిస్తున్న జానకి ఒకసారి ఉలిక్కిపడింది. కొడుకు ఎగిరి ఎగిరి పడుతు ఆయాస పడుతున్నాడు. బాబు ధనుష్ ఏమిటి నాన్న అంటు పిలుస్తూ.ఏడుస్తూ అడుగుతుంది.కాని బాబు చూడడం లేదు అయ్యో ఏం చేయాలి? బయట ధాన్యాపు బస్తాలతో నిండి రెండు బండ్లు ఉన్నాయి. ఇంకో బండిలో బస్తాలను పెడుతున్నారు. ఓ నర్సయ్య ఆగు ఆ బండిలో బస్తాలను పెట్టకు బాబును దవాఖానకు తీసుకుపోవాలా. రా నువ్వు ఒకసారి అంటు పిలుస్తూ బయటకు వచ్చిన భార్యతో
రాయుడు ఏమే నీకు శరం వుందా! ఇప్పటికే ఆలస్యం అయినాది సంతకి ధాన్యం పోవాలా! ఆలస్యం అయితే ధర పడిపోతుంది. ఆ శంకరయ్యను పిలిపిస్తాను. ఏదైనా మందు ఇస్తాడు. ఊరుకోండి మీరు మీ డబ్బులు నా కొడుకు ఏమైనా అయిందంటే నేను ఊరుకొను. నేను ఈ బండిలో నా కొడుకుని తీసుపోతాను. మీరే మీ ధాన్యాన్ని రేపు పంపించుకొండి. యాందే
నీకు భయం లేకుండా పోతాంది. నీకేనయ్య ప్రాణం అంటే లెక్క లేనిది బాబును చూడవయ్యా ఎట్ట వణుకుతున్నడో ! నీమాట వినే ఇప్పటికి ఇద్దరు బిడ్డలను దూరం చేసుకున్నా, ఇంకా చూస్తా నా బిడ్డను దూరం చేసుకొను. నేనూ ఎవరి మాట వినను. మీరు మీ డబ్బులు ఏం చేసుకుంటవయ్యా. పిల్లలే లేనప్పుడు ఉరేగుతావా! అంటు కొడుకును నర్సయ్య సహాయంతో పట్టుకొని బండి ఎక్కి కూర్చుంది. వేగిరం గా తీసుకు పో నర్సయ్య అంది. అట్టనే అమ్మ గారు, అంటు బండిని ఉరికించాడు.
ఆ ఊరి నుండి పట్నం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది .ఇలా అందరి పనివాళ్ళ ముందు తన భార్య తనను ఎదిరించే సరికి రాయుడు అలాగే కుర్చీలో కూర్చోని పోయాడు. యాంది ఇట్ట జరిగింది. జానకి సెప్పింది నిజమేనా! నేను డబ్బు మనిషినేనా?. ఆలోచిస్తూ అలాగే ఉన్నాడు. జానకి నర్సయ్య సహాయంతో దవాఖానా లోకి హడవుడిగా బాబుని తీసుకోని వెళ్లింది. డాక్టర్ గారు బాబుని సూడండి ఉలుకు పలుకు లేదు అంటు ఏడుస్తూ చెపుతున్నా జానకితో గాబరా పడకండమ్మ అంటు బాబుని పరీక్ష చేసి నర్స్ సహాయంతో సిరేన్ పెట్టాడు. డాక్టర్ జానకితో సరియైన సమయానికి తీసుకొచ్చారమ్మ ఏం పర్వాలేదు.ఆ ఆయాసము ఎక్కువైతే ప్రాణానికి అపాయం జరిగేది అన్నాడు. ఆ ఊరి చెట్లమందులు వాడడం మంచిది కాదు అని మరి చెప్పాడు. డాక్టర్ రాసి ఇచ్చిన మందులు కొనుక్కుని తిరుగు ప్రయాణం అయింది. జానకి ఇంటికి వచ్చేసరికి రాయుడు ఎదురుగా వచ్చాడు. ఆ నిముషం లో జానకికి భయంగా ఉంది. ఏమైనా అంటాడా ?ఎలా? అనుకుంటు అతనివైపు చూసింది. ఎట్ట ఉంది బాబుకి జానకి అన్నాడు .బాబునిచేతితో పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది. ఇప్పుడు బాగానే ఉందయ్యా.ఒక నిముషం ఆలస్యం అయిన బాబు దక్కేవాడు కాదయ్యా అంటు ఏడిచింది. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎదిరించాను. అంతా కన్నా మార్గం నాకు కనిపించలేదు .లేదే జానకి నువ్వె నన్ను క్షమించాలా నువ్వు చెప్పింది నిజమేనే నేను ఎప్పుడైనా డబ్బుల గురించే ఆలోచించాను.నా మూర్ఖత్వము వలెనే ముందు నా బిడ్డలను పోగొట్టుకున్నాను. నా కండ్లు తెరిపించావే. మన ఊరిలో ఒక దవాఖానా ఏర్పాటు చేస్తాను. ఇంకముందు ఇట్టాంటి బాధలు ఎవరు పడకూడదు అన్నాడు. భర్త లో వచ్చిన మార్పుకి జానకి ఆనందంగా ఆయన వైపు చూస్తూ ఉండిపొయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!