చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు

రచన: జీ వీ నాయుడు

గీత ఓ పల్లెటూరు అమ్మాయి.10 వ తరగతి వరకు చదువు కుంది. తల్లి లేక పోవడంతో తండ్రి అన్నీ తానై పెంచాడు. తండ్రి రామయ్య తన స్నేహితులు ద్వారా ఒక సంబంధం తీసుకొని వచ్చాడు. పేరు హరి. ఓ ప్రవేటు ఉద్యోగి. ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపదం తో గీత హరి ల వివాహం పూర్తి అయింది. హరి పీజీ వరకు చదివాడు. తెలివైన అబ్బాయి కూడా. పెండ్లి అయిన నాలుగు నెలలకు వేరే ఇంట్లో ఫ్యామిలీ పెట్టారు.
గీత ఒంటరిగా ఇంట్లోనే ఉండేది. హరి కీ గీత ను చదివించాలి అనుకున్నాడు. మొత్తానికి ఆమె ను ఒప్పించి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయించాడు. అంతటి ఆగకుండా పీజీ చేయించాడు. అనంతరం బి ఈడీ చేయించాడు. ఓ ప్రవేటు స్కూల్ లో టీచర్ ఉద్యోగం లో చేర్చాడు గీత ను.. వారికీ ఇద్దరు సంతానం. కష్టం తెలియకుండా పిల్లలను చదివించారు. ఇద్దరు పిల్లలు ప్రవేటు ఉద్యోగం చేస్తున్నారు
సాఫీ గా సాగుతున్న వీరి సంసారం లో తరచూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి భార్య భర్త లు ఒక ఇంట్లోనే ఉంటున్నారు. కాని వారి మధ్య కొన్ని ఏళ్లుగా మాటలు లేవు. కనీసం హరి తన భర్త అనే విషయం కూడా గుర్తుకు రాన్నంత గా గీత ద్వేషం పెంచుకున్నది. వీరి మధ్య ఇంత స్థాయి లో కలహాలు ముదిరెందుకు ప్రధాన కారణం చెప్పుడు మాటలు.
హరి కీ పెద్ద గా స్నేహితులు లేరు. తన పనేదో తనేదో అన్నట్లు గా కొంత రిజర్వుడు గా ఉంటాడు హరి. దీంతో హరి పని చేసే సంస్థ లో ఓ సహచర ఉద్యోగి హరి పట్ల ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నాడు బాబు అనే సహచరుడు. హరి కుటుంబం లో కలతలు రేపాలి అనే ఓ దుర్మార్గ ఆలోచన కు పదును పెట్టాడు బాబు. హరి బాబు పిల్లలు ఒకే సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు .ఆ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు యాజమాన్యం. ఆ కార్యక్రమం కోసం హరి బదులు తన భార్య గీత హాజరు అయింది. బాబు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. డిన్నర్ సమయం లో గీత పిల్లలు బాబు పిల్లలు ముచ్చట్లాడుకుంటున్నారు. అదును కోసం ఎదురుచూస్తున్న బాబు గీత దగ్గరికి వచ్చి బాగున్నారా సిస్టర్ అంటూ మాటలు కలిపారు. హరి గారు రాలేదా అని ప్రశ్నించాడు గీత ను బాబు.. తనకు ఏదో పని ఉంది అని చెప్పడంతో నేను వచ్చాను అన్నయ్య అని బదులు చెప్పింది గీత.. ” అవునులే.. అమ్మా.. పాపం హరి.. రెండు ఫ్యామిలీ లు చూసుకోవాలి కదా ” అని ఓ తూటా లాంటి మాట విసిరి వేయడం తో ఆమె ముఖం ఎర్రబారింది.. ” అవునా… అన్నయ్య… మీరు చెప్పేది నాకు పూర్తి గా అర్ధం కాలేదు. కొంచం అర్ధం అయ్యేలా.. వివరాలు చెప్పండి ప్లీజ్ అన్నయ్య ” అని ప్రాడేయపడింది గీత. అంతే అతను ఒక్కసారి గా తేనే తుట్టి లేపిన దానికన్నా గంభీరంగా లేపాడు. అప్పటి నుంచి గీత హరి ల మధ్య యుద్ధం ఆరంభం అయింది.
భార్య భర్త లు అనే భావన కేవలం సమాజానికే అన్నట్టు కొనసాగుతుంది వారి కుటుంబం.
ఒక రోజు గీత తన బంధువులు అందర్నీ రప్పించింది ఇంటికి.. బాబు చెప్పింది మొత్తం బంధువులు ముందే హరి ని నిలదీసింది. హరి, ” నేను శ్రీరామ చంద్రుడు లాంటి వాడిని, నాకు ఏ పాపం తెలియదు. మీరు నిరూపించండి. నేను ఏ శిక్ష కు అయినా సిద్ధం ” అని వాధించాడు హరి.. నిప్పు లేనిదే పొగ రాదనీ.. నాలుగు గోడలు మధ్య జరిగే రాస లీలల కు రుజువు కావాలి అంటావా అంటూ గీత బంధువులు హరి ని తీవ్రంగా హింసించారు. అప్పట్లో మొదలైన కుటుంబ కలహాలు నేటికీ కొన సాగుతున్నాయి.
హరి తో పాటు హరి తరపు బంధువులు ఎంత చెప్పినా పిల్లికి ఎలుక సాక్షమా అంటూ కొట్టి పారేస్తుంది. సమాజంలో బాబు లాంటి చీడ పురుగులు ఎందరో ఉన్నారు. చెప్పుడు మాటలు విని విచక్షణ మరచి సంసారాలను విచ్చిన్నం చేసుకునే వారూ ఉన్నారు.
చెప్పుడు మాటలు వింటే కుటుంబం చిన్నా భిన్నం కావడం తథ్యం. తస్మాత్ జాగ్రత్త….!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!