మంగమ్మ లంకెబిందెలు

మంగమ్మ లంకెబిందెలు

రచన: జయ

నిద్రలేచి అమ్మ ..అమ్మ అని పిలుస్తూ ఏడుస్తుంది ఏడేళ్ళ హనీ.
ఏంటి చిన్ని తల్లి అలా ఎడుస్తున్నావ్.
నాకు లంకెబిందెలు కావాలి.
ఓయ్ చిన్నితల్లి లంకెబిందెలా,ఏమి అడుగుతున్నావ్.
అవి ఎందుకే నీకు, అస్సలు అవి ఎలా ఉంటాయో తెలుసా.
అవును అమ్మ లంకెబిందెలు అంటే ఏమిటి.
అవి ఎంటో కూడా తెలియకుండా లంకెబిందెలు కావాలి అని అడిగావా నీవు.
అవును అమ్మ నాకు తెలియదు.
నాన్నమ్మ ని చాక్లెట్ కోసం డబ్బులు అడిగితే నా దగ్గర లంకెబిందెలు దాచి పెట్టావా అని అడిగింది.
అంటే లంకెబిందెలు ఉంటే చోకలెట్స్ ఇస్తారు అనే గా అందుకే నాకు లంకెబిందెలు కావాలి.
అవునా ఓరిని నీ తెలివి బంగారం గాను.
అలా వచ్చావా నువ్వు.
అమ్మ డాడీ ని ఇంటికి వచ్చేటప్పుడు లంకెబిందెలు తీసుకొని రమ్మని చెప్పు.
నువ్వు ఊరుకో తల్లి అవ్వి కోట్ల దగ్గర దొరకవు.
ఏమో నాకు తెలియదు డాడీ ని తీసుకురమ్మను.
ఇది ఇంకా బాగుంది.
అన్న ఆవిడ బానే ఉంది.నువ్వు నన్ను చంపుతున్నావ్.
ఏమో నాకు కావాలి అని ఏడుస్తున్న కూతురిని సముదాయించలేక జయ కి కన్నీళ్లు ఒకటే తక్కువ అయ్యాయి.ఈ గొడవ ఇలా జరుగుతుండగానే పక్కింటి పంకజం పిన్ని వచ్చి.
జయ మొన్న మంగమ్మగారి మనవడు చూసావా ఏమైంది,
నేను చూడలేదే మా ఆయన షాపింగ్ అని తిసుకువెళ్లారు.
అవునా ఏమి తీసుకున్నారు షాపింగ్ లో.
హా ఏముంది నా మొఖం, మీ బాబాయి కొనే రకమేనా, నేను ఏదో ఆశ పడి వెళ్లడం బేలా మొఖం వేసుకొని తిరిగిరావడం అంతేనమ్మ ఎప్పుడు,అనవసరంగా సీరియల్ మిస్ అయ్యాను.
అవునా పిన్ని నేను చూడను గా సీరియల్స్ ,మా అత్తగారు చూసారు వెళ్లి అడుగు లోపల ఉంది చూడు
ఇది ఒక్కద్ధి  ఒక రోజు మిస్ అయితే ఏమౌతుంది నా బొందా.
అందరు అందరే నా ప్రాణాలు తోడేస్తున్నారు.
మంగమ్మగారి మనవడా నా బొందా నా జీవితమే ఒక అని అనుకోగానే ఈ మంగమ్మ లంకెబిందెలు ఈ రెండింటికి ఏదో ఉన్నట్టు గుర్తుకు వస్తుంది.
వెంటనే చేసే పని ఆపేసి వాళ్ల అమ్మకి ఫోన్ చేసి.
అమ్మ మంగమ్మ మామ ఎలా ఉన్నారు.
పెళ్ళైన కొత్తలో ఆవిడకి లంకెబిందెలు దొరికాయి అని అనుకున్నారు.
ఓహ్  ఆవిడ ఇప్పుడు లేరు మొన్న ఆ మధ్యనే కాలం చేశారు.
ఆ లంకెబిందెలు సంగతి ఏమి అడుగుతావ్ లే అని ఒక పెద్ద స్టోరీ చెప్పుకొచ్చింది.
అవును అది సరే గాని హానీ ఏమిచేస్తుంది.
నా బుర్ర తింటుంది.
అదేంటి జయ ఉన్న ఒక్కగాని ఒక పిల్లని కూడా పెంచలేకపోతున్నవా.
అది కాదు అమ్మ, ఈ లాక్డౌన్ పుణ్యమాని అందరూ ఇంట్లోనే,పైగా చేసిపెడుతుంటే తిని కూర్చోక గొడవలు.
ఇక ఈ పిల్ల పొద్దుటినుంచి లంకెబిందెలు కావాలని ఒకటే ఏడుపు.
ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు.దానికి అవి ఎలా తెలుసు, నేను తెలుసుకుంటా లే నువ్వు కంగారు పడకు.
మీ నాన్న బయటకు వెళ్ళరు వచ్చాక ,ఒక సారి నీ దగ్గరకు వెల్లధం అని అడిగి ఇద్దరం వస్తాం
సరే అమ్మ ఉంటా. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది.
హాని పడుకుని లేచే సరికి జయ వాళ్ళ అమ్మ ను చూసి ,అమ్మమ్మ అని దగ్గరికి వెళ్లి హత్తుకొగానే నా బంగారు తల్లి కి ఏమితేచ్చానో చూడు.
అని చోకెల్ట్స్,బొమ్మలు చూపించింది.
హాని ఒక నిమిషం సంతోషం తో నవ్వి, అంతలోనే మూతి ముడుచుకొని నాకేమి వద్దు నాకు లంకెబిందెలు కావలి.
ఓరిని ఇదేమి లంకెబిందెలు గొడవే.
అమ్మామ్మ లంకెబిందెలు అంటే ఏమిటి హాని అడిగిన ప్రశ్నకు నవ్వుకొని ఇలా రా నీకు లంకెబిందెలు గురించి చెబుతూ.
లంకెబిందెలు అంటే పూర్వం రాజులు పరిపాలించేవారు రాజ్యాలను, ఆ సమయంలో యుద్దాలుకు,దొంగలకు భయపడి బాగా ధనవంతులు తమ వద్ద ఉన్న డబ్బుని,బంగారాన్ని బిందెలో పెట్టి వాటిని భూమిలో దాచి ఉంచే వారు.
అలా దాచుకున్న వారు చనిపోవడం కానీ,లేదా మరేదైనా కారణం వల్ల కానీ ఆ బిందెలని దాచినచోటే ఉంచేసేవారు.అలా కాలగర్భంలో కలిసిపోయి.అది కొద్దికాలం తర్వాత ఎవరికైనా  దొరికెతే అదృష్టంగా భావించేవారు కష్ట పడకుండా ఆస్తులు కలిసి రావడం తో ఆనందం గా ఉండేవారు.
మా ఊరిలో మీ అమ్మ చిన్నపుడు మంగమ్మ అనే బామ్మ వుండే వారు. ఆమెకి పిల్లలు లేరు.
ఆమె భర్త కూడా చిన్నవయస్సులో నే చనిపోయారు.
ఆవిడకి పొలాలు, ఆస్థులు ఉన్న,ఆవిడ స్వయంగా ఇంటిపనులు,పొలం పనులు చూసుకునేది. ఆ ఊరిలోని ఆమె చెల్లి కూడా ఉండేది.
ఆమె కొంచెం స్వార్ధం గా ఉండేది.
అక్కకి పిల్లలు లేరు,పైగా ఆస్తులు కూడా ఉన్నాయి. అక్క చనిపోతే ఆ ఆస్థులు నా పిల్లలకి వస్తాయి అనే ధూర్దేశం తో తన పిలల్లను
మంగమ్మ కు దగ్గర చేసింది. మంగమ్మ ఆ పిలల్లను సొంత పిల్లలా పెంచి పెద్దచేసి వారికి ఏ లోటు రాకుండా చూసుకునేది.
మంగమ్మ కి వయస్సు పెరిగి ముసలి తనం వచ్చాక,పొలం పనులు చేయ్యలేక చెల్లెలి పిల్లలను పిలిచి తన సమస్య వివరించి కొంచెం పొలం పనులు చూసుకోమని పురమాయించింది.వాళ్ళు మంగమ్మ ఇచ్చిన డబ్బును సొంతపనులకు వాడుకొని,పొలం పనులు వదిలేశారు. మంగమ్మ అడిగితె చేసాము అని చెప్పే వారు.
ఒకరోజు పక్కింటి ఆయన వచ్చి ఏంటి మంగక్కా పొలం పనులు చెయ్యకుండా వదిలేశారు ఇలా అయితే పంట పండటం  అసాధ్యం అని చెప్పగానే,అప్పుడు వాళ్ళ చెల్లి, పిల్లలు డబ్బుకోసం తన దగ్గరకు చెరారు అని అర్థం అయ్యి.
వీళ్ళకి ఎలా అయినా బుద్ది చెప్పాలి అని ఒక ఉపాయం తో  తన చెల్లి దగ్గరకీ వచ్చి చెల్లి,
మీ బావ చనిపోయే ముందు మా పొలాల్లో లంకెబిందెలు దాచాను అని చెప్పారు.
కానీ ఎక్కడో  తెలియడం లేదు. అందుకే,వాళ్లకి పొలం పనులు అప్పగించాను.
వాళ్ళు ఆ పనులు చేస్తున్నపుడు ఆ లంకెబిందెలు దొరికితే చెరో బిందె ఇచ్చేద్దాం అనుకున్నా, ఎలా అయినా నా తరువాత నా ఆస్తి అంతా వాళ్లకే గా, నేను ఏమైనా పైకి
వెళ్ళేటప్పుడు పట్టుకుపోతాన ఏంటి.
పోనీలే వాళ్లకి ఎంత ప్రాప్తమో అంతే.
మీ బావగారు చెల్లి కొడుకు వస్తున్నాడు.
వాడినే ఆ పొలం పనులు చేసుకొని దొరికితే వాడినే తీసుకోమంట.
మంగమ్మ మాట వినగానే చెల్లి కి గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది.
వామ్మో ఇప్పుడు అక్క ఆస్తి అంతా వాడికే ఇచ్చేస్తుందా,ఈ సోమరిపోతులకు ఎంత చెప్పినా అర్ధం కాదు.
ఎలైనా వీళ్ళని పొలం పంపించాలి.
అని కొడుకులు రాగానే పని చేయడానికి ఒప్పించి పొలం పంపింది.
వాళ్ళు ఆ లంకెబిందెలు కోసం ఆశ పడి  పొలం అంతా దున్నేశారు.
కానీ వాళ్లకి ఆ లంకెబిందెలు దొరకలేదు.
కానీ మంగమ్మ పొలం అంతా చక్కగా పండి. ఆ సారి మంచి ఆదాయం వచ్చింది.
వీళ్ళు కోపం గా మంగమ్మ దగ్గరకు వెళ్ళి.
నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావు లంకెబిందెలు లేవు,ఏమి లేవు అని నిష్టురంగా మాట్లాడుతుంటే అప్పుడు మంగమ్మ  నిజంగానే లంకెబిందెలు దొరికాయి మీకు.
అవి మీ శ్రమ,మీ పట్టుదల అవి రెండూ నా దృష్టిలో  లంకెబిందెలు తో సమానం.
మీకు అలా చెప్పకపొతే మీరు కష్టపడి చేసేవారు కాదు, అప్పుడు  పంట మన చేతికి వచ్చేది కాదు కదా.!
ఇప్పుడు చూడండి అధిక లాభం వచ్చే పంట పండింది.
ఈ లాభం అంతా మీదే కదా,
చూడండి పిల్లలు మనం కష్ట పడి సంపాదించుకున్నదే మన సొంతం.
ఊరికే వచ్చే దాని కోసం ఆశ పడితే నిరాశే ఎదురువుతుంది.
మంగమ్మ మాటలకి వాళ్లకి మంగమ్మ చెప్పింది నిజమే కదా అనిపించింది.
కష్ట పడి సంపాదించుకున్న దానిలో ఆనందం ఉంటుంది. అని మనసులో అనుకోని. ఆ రోజు నుంచి పొలం పనులు చూసుకుంటూ, మంగమ్మ ని కూడా బా చూసుకున్నారు.
చివరిరోజుల్లో మంగమ్మ తన ఆస్తిలో సగభాగం చెల్లి పిల్లలకి రాసి,మిగతా సగం
అనాథశరణాలయానికి రాసి కాలం చేసింది.
అని కథ చెప్పుకొచ్చింది హాని కి.
చూడు బంగారం ఇప్పుడు లంకెబిందెలు అనేవి ఉండవు. పూర్వము రోజుల్లో అనే వారు కానీ ఇప్పుడు దొరకవు.
ఇప్పుడు అంతా శ్రమ మీద ఆధారపడి ఉంది.
నువ్వు బా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే నీకు బోలెడు డబ్బులు వస్తాయి అప్పుడు నీకు కావసలిసినవి కొనుకోవచ్చు అర్ధం అయ్యిందా.
అమ్మమ్మ చెప్పిన మాటలకు పేచీ మాని ఒకే అమ్మ నేను బా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తా ని అమ్మమ్మ చేతిలో ఉన్న చోకలెట్స్ తీసుకొని ఆడుకోడానికి వెళ్ళిపోయింది.
జయ థాంక్స్ అమ్మ బ్రతికించావ్ లేకపోతె ఈ పిల్లని ఎలా సముదాయించాలో అర్ధం కాలేదు.
అదేమి లేదు జయ  పిల్లలకు చెప్పే విధంగా చెబితే వింటారు.
సరే నేను వెళుతున్న అని చెప్పి వెళ్లిపోయిన అమ్మ ను చూసి నవ్వు కుంటూ తన పనులులో ముంగిపొయింది జయ.
ఇది అండి మా మంగమ్మ లంకెబిందెలు కథ.
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!