ఓ కోరిక

ఓ కోరిక

రచన: యాంబాకం

ఒక ఊరిలో కనకయ్య అనే గొల్లవాడు ఉండేవాడు. ఆ ఊరి జనం కనకయ్యను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వుండేవారు.అది కనకయ్య కు ఇష్టం ఉండేది కాదు. అందుచేత అతనికి “ఓకోరిక”కలిగింది. ఏదైన మంత్రం నేర్చుకొని ఆ మంత్రం ఆ ఊరి జనం పై ప్రయోగించి వారి భరతం పట్టాలను కొన్నాడు. ఐతే మంత్రం నేర్పేవాళ్ళ గురించి, ఎదురు చూడసాగాడు.
ఒకరోజున అదృష్టం పండి ఆఊరి మఠంలోకి ఒక సాధువు వచ్చి మకాం వేసాడని,అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది. కనకయ్యకు వెంటనే అతని భార్యతో కలిసి మఠానికిపోయి ఆ సాధువుని సేవించి అనేక విధాలుగా గౌరవించారు.
ఆ సాధువుకు కనకయ్య దంపతులే మఠంలో భోజనం స్వయంగా వండి సాధువుకు పెట్టి భోజనం ఐన తరువాత సాధువు భుక్తాయాసం తీర్చుకొంటూ సంతోషంగా ఉన్న సమయాన కనకయ్య సాధువు ను ఆశ్రయించి ఆమాటా ఈమాటా చెబుతూ,తన కోరిక తెలిపాడు.
సాధువు అది విని కనకయ్య తో “మంత్రం తంత్రం ప్రమాదకరం,అందుకనే మేము దానిని లోకానికి వెల్లడించము” అన్నాడు సాధువు. కనకయ్య సాధువుని వదలలేదు కదా బాగా పొగడసాగాడు. ఇక సాధువు దిగివచ్చి చివరికి ఇలా అన్నాడు”ఓయీ కనకయ్య “! సరే నీ కోరిక ప్రకారం మంత్రంనేర్పుతాను.ఐతే అది కేవలము వినోదం కోసమే పనికి వస్తుంది. ఈ మంత్రం ఎవరిపైన అయితే ప్రమోగిస్తావో వారు తోడేలు గా మారి పోతారు కానీ ఎవరినైనా సరేవారు కోరితేగాని నీవు తోడేలుగా మార్చలేవు! అని చెప్పాడు.
తరువాత -కనకయ్యకు రహస్యంగా రెండు మంత్రాలు నేర్పాడు. రెండు రకాల విభూతి ఇచ్చాడు.”కనకయ్య మొదటి మంత్రం పఠించి ఈ విభూతి చల్లితే ఏమనిషి నయినా తోడేలుగా మారిపోతాడు. ఆతోడేలు తలమీద నువ్వు మార్చినట్టు ఆనవాలు కనిపిస్తుంది. నీకు సరదా తీరగానే రెండవ మంత్రం పఠించి విభూతి తోడేలు తలమీద ఆనవాలు పైన పడేటట్టు చల్లితే అది మళ్ళి మామూలు మనిషి గా మారి పోతుంది. ఐతే ఒక్క ముఖ్య విషయం గుర్తుపెట్టుకో -నీ మంత్రం వల్ల మనిషి తోడేలు గా మారి పోయినప్పుడు,దానికి
మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు జాగ్రతగా వుండాలి, అని చెప్పి సాధువు ధ్యానంలోకి జారుకొన్నాడు.
కనకయ్య ఎలాగైతే నేమి తన అనుకొన్నట్టే మంత్రం నేర్చుకొన్నాని ‌గర్వపడుతూ భార్యతోకలిసిఇంటికిచేరుకొనన్నారు. కనకయ్య భార్య ఆ మంత్ర మహిమ చూడాలి నేను ఎప్పుడూ తోడేలుని దగ్గరగా చూడలేదు,చూపించమని కూర్చుంది. అదీగాక కనకయ్య కు కూడా మంత్రం పని చేస్తుందో లేదో చూడాలని అత్రంగా వున్నది.
అప్పుడు కనకయ్య భార్యతో “చూడు, తోడేలు మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు వాళ్ళ ఇష్టం లేనిదే నేను వాళ్లను మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పతాను. నన్ను తోడేలుగా మార్చు. నువు చూడటం పూర్తి అయ్యి, నీ సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చెదువు గాని అంటూ భార్యకు మంత్రాలు రెండూ నేర్పి ప్రయోగించే విధానం చెప్పి విభూతి చేతికిచ్చాడు.
తీరా తోడేలుగా మారిన తన భార్యకు ఎలాంటి హాని కలగకుండాఆలోచించి,అమెను అటకపైకి ఎక్కించాడు. తరువాత గది తలుపులు మూసివేసి కనకయ్య తయారు గా అటక కిందకు వచ్చి కూర్చున్నాడు.
కనకయ్య భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి విభూతి చల్లి కనకయ్య ను తోడేలు గా మార్చేసింది. కనకయ్య తోడెలుగా మారటంతోనే భయంకరంగా అరవటం మొదలు పెట్టి బయటికి పోయే మార్గం కోసం తలుపులు బద్దలు కొట్ట నారంభించాడు.
తోడేలు గా మారిన కనకయ్య చూచి వాని భార్య హడలిపోయింది.ఆ భయంతో రెండవ మంత్రం కాస్తా మరిచి చక్కాపోయింది. తన చేతిలోని విభూతిని రెండు మూడు సార్లు తోడేలు మొహన చల్లింది కాని మంత్రం మరిచి పోయిన కారణంచేత ఏమీ లాభంలేక పొయింది.
కొంతసేపటికి ఎలా అయితేనేం తోడేలు తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కనే ఉన్న అడవి లోకి పారి పోయింది. పోయిన తరువాత కనకయ్య భార్యకు కొంచెం మనస్సు స్థిమితపడి రెండవ మంత్రం గుర్తు వచ్చింది, కాని ఏం లాభం!
తన తెలివి తక్కువ పనికి అమె చాలా విచారించి భర్త గురించి బెంగపెట్టు కొన్నది.రెండు మాసలుగడిచిపోయినా భర్త జాడ తెలియక పోవడంతో దేవుని ప్రార్దించడం మొదలు పెట్టింది.ఇంతలో పక్క ఇంట్లో ఉండే తోటి వారిలో ఒకరి సహాయం తీసుకుని వాని వెంట బెట్టుకొని అమె ధైర్యంగా తన భర్త కోసం అడవిలో వెదక సాగింది.
ఇలా ఉండగా,ఆ ఊరిలో కొత్తగా ఒక తోడేలు వచ్చి రాత్రి పూట ఊరు మీద పడుతున్నదని ఊరు వారంత భయపడ సాగారు.అందులో ఒకరైన ఊరు పెద్ధ మనిషి “మీకు వచ్చిన భయం ఏమి లేదని నచ్చ చెప్పి తోడేలు సంగతి చూడటానికి నలుగురు యువకుల సహాయంతో అడవికి బయలు దేరారు. ఎంత వెతికినా ఆ తోడేలు వారి అగుపించ లేదుకదా తెలివిగా తిరుగుతుంది అడవిలో, వెతకడానికి వెళ్ళిన మనుషులు విసిగి అలసి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయారు.
అంతలోనే వాళ్ళకు వెనుక నుంచి ఒక వికారపు అరుపు వినిపించింది.అది తోడేలే!అది వారి పై దూకింది దానితో అందరికీ పై ప్రాణాలు పైకి ఎగిరి పొయాయి అడవికి వచ్చిన ఊరి వారికి కాని వాళ్ళు అందరూ ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూవుండగానే ఆ తోడేలు గొల్లవాడు గా మారిపోయాడు అతడే కనకయ్య!
కనకయ్య కు తోడేలు గా మారిపోయిన క్షణం నుంచి తను ఏమేంచేశాడో తెలియదు. ఆకస్మికంగా అడవిలో అతనికి మనిషి రూపం వచ్చే సరికి,తను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో అర్దం కాలేదు.
కనకయ్య వణికిపోతూ గ్రామస్థుల కాళ్ళ మీదపడి క్షమించమని,వేడుకొన్నాడు. వారు ఆశ్చర్యంలో మునిగి పోయారు .వారికి అదేమి అర్దంకాలేదు.
ఆసమయంలో పక్కన వున్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగివచ్చింది. అమె ఎవరో ఈ అడవి లో కనపడటం ఏమిటీ గ్రామస్థులు అయోమయం లో పడ్డారు. పైగా వారు తోడేలు బారి నుండి వాళ్ళ ను రక్షించింది ఈమేనా అని అనుకొని వెంటనే అమెకు నమస్కరించి,మీరు ఎవరు?అని ప్రశ్నించగా అమె నేను మనిషిగా మారిన కనకయ్య భార్యను అని చెప్పగా అందరూ ఆశ్చర్యంతో బోసిపోగ ఆమె గ్రామస్థులకు తన కథ అంతా చెప్పింది. తోడేలు గా మారిన భర్త కోసం అడవి లో తిరుగుతూవుంటే తోడేలు అక్కడకు రావటం సంభవించింది. వెంటనే అమె గుర్తు పట్టి చెట్టు ఎక్కి కూర్చున్న ది. గ్రామస్తులపై దూకటం చూసి రెండవ మంత్రం చెప్పి విభూతి చల్లి తన భర్తకు తిరిగి మామూలు స్వరూపం వచ్చేటట్లు చేసింది.
అమె చెప్పిన కథ విని గ్రామస్తులు తమకు ప్రాణంధానం చేసిన అమెను మెచ్చుకొని ఆనలుగురి లో పెద్దవాడైన గ్రామస్తుడు ఒకడు కనకయ్యకు కొంత పొలం ఇచ్చి వారిని ఆదుకొన్నారు.అప్పటి నుండి కనకయ్య దంపతులు సుఖంగా ఆ ఊరివారితోకూడ కాలక్షేపం చేస్తున్నాడు.
వాళ్ళ ఇద్దరికి మంత్రం నేర్చుకోవాలన్న” కోరిక” సరదతీరడమే కాకుండా నాటినుంచి వాళ్ళ వంశానికి తోడేలు వంశం అని పేరు వాడుకలోకి వచ్చింది.కొంత కాలానికి సాధువు మళ్ళీ వచ్చారు. కనకయ్య కథ విని నవ్వుకొన్నాడు.
,,,,,,,,,,,,,,,,,,,,

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!